Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
- రష్యా-ఉక్రెయిన్ మధ్య ఎనర్జీ కాల్పుల విరమణ
- ఒప్పందం తక్షణమే అమల్లోకి వస్తుందని ట్రంప్ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం సంభవించింది. రెండు దేశాల మధ్య తక్షణమే అమలులోకి వచ్చేలా ‘ఎనర్జీ సీజ్-ఫైర్’ ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ ఆదివారం తన సోషల్ మీడియా వేదికగా ట్రూత్ సోషల్‌లో ఈ ప్రకటన చేశారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఎనర్జీ రంగానికి సంబంధించిన కాల్పులు విరమణ తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఇరు దేశాలు ఈ ఒప్పందానికి అంగీకరించాయి, దీనిని ఉల్లంఘించవద్దని ట్రంప్ హెచ్చరించారు. అయితే, ఈ ఒప్పందం ఎంత కాలం అమలులో ఉంటుంది అనే దానిపై స్పష్టత లేదు.
ట్రంప్ ప్రకటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్ స్కీ స్పందిస్తూ.. ఇది తనకు కొత్త విషయమని అన్నారు. దీనికి ముందు ఆయన మాట్లాడుతూ.. రష్యా రిఫైనరీలపై దాడులు చేయమని, కానీ ముందుగా తమ ఎనర్జీ మౌలిక సదుపాయాలపై రష్యా దాడులు నిలిపేయాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడి కనీసం 2 నెలల పాటు సంపూర్ణ కాల్పుల విరమణకు అంగీకరించేలా ట్రంప్‌ను జెలెన్ స్కీ కోరారు. ఈ సమయంలో ఉక్రెయిన్ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటామని చెప్పారు.
Also Read
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
- Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ఇదిలా ఉంటే, తాజా పరిణామాలు ఉక్రెయిన్, అమెరికా మధ్య తీవ్ర విభేదాలకు కారణమవుతున్నాయి. రష్యా, తమపై దాడులు చేసేలా అమెరికా ప్రోత్సహిస్తోందని జెలెన్ స్కీ ఆరోపించారు. ఇదే సమయంలో ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు రావాలని ట్రంప్ కోరడం సంచలనంగా మారింది. రష్యాతో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడంలో జెలెన్ స్కీ విఫలమయ్యారని విమర్శించారు. దీనికి ప్రతిగా తమ దేశ నాయకుడిని ఎన్నుకునే హక్కు ఉక్రెయిన్ ప్రజలకే ఉందని అన్నారు. రష్యాపై ఒత్తిడి తెచ్చి యుద్ధాన్ని ముగించేలా అమెరికా, యూరప్ పనిచేయాలని కోరారు.
తాజావార్తలు
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!