Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- గాల్లో పవర్ బ్యాంక్‌లో మంటలు.. విమానంలో కలకలం ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తుండగా ఘటన శంషాబాద్‌లో సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ పవర్ బ్యాంక్‌లో మంటలకు కారణాలపై విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో సడన్‌గా సాంకేతిక విపత్తు ఎదురవడంతో శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ (Emergency Landing) చేశారు. ఢిల్లీ నుంచి చెన్నై బయలుదేరిన ఇండిగో విమానం (6E 6115) ఆకాశంలో ప్రయాణిస్తుండగా, ఓ ప్రయాణికుడి వద్ద ఉన్న పవర్ బ్యాంక్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్యాబిన్ నుంచి పొగలు రావడం గమనించిన విమాన సిబ్బంది క్షణాల్లో అప్రమత్తమయ్యారు. వెంటనే విమానంలో అందుబాటులో ఉన్న అగ్నిమాపక పరికరాలు (Fire Safety Equipment) ఉపయోగించి మంటలను త్వరితగతిన ఆర్పేశారు.
హైదరాబాద్‌కు దారిమళ్లింపు.. సేఫ్‌గా ల్యాండింగ్
విమానంలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పైలట్లు వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)ని సంప్రదించి, అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరారు. అనంతరం చెన్నై వెళ్లాల్సిన విమానాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు దారిమళ్లించారు. రన్‌వేపై విమానం సురక్షితంగా ల్యాండ్ అవ్వడంతో ఎయిర్పోర్ట్ అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. విమానంలోని ప్రయాణికులందరూ పూర్తి క్షేమంగా ఉన్నారని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఎయిర్పోర్ట్ యాజమాన్యం అధికారికంగా ధ్రువీకరించింది.
Also Read
- Rice Price Fraud : బియ్యం దందాకు చెక్.. హైదరాబాద్‌లో 11 కేసులు.!
- Hyderabad Clean and Traffic-Free : హైదరాబాద్‌కు కొత్త టార్గెట్.. క్లీన్ అండ్ ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మార్పు
- Amit Shah : రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ బీజేపీయే గెలవబోతోంది
- Amit Shah : కాంగ్రెస్‌ను గద్దె దించడమే లక్ష్యం.. చొరబాటుదారులను తరిమికొడతాం
పవర్ బ్యాంక్‌పై అధికారుల విచారణ
ఈ ప్రమాద ఘటనపై శంషాబాద్ ఎయిర్పోర్ట్ భద్రతా సిబ్బంది , విమానయాన అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. ప్రయాణికుడు వినియోగిస్తున్న పవర్ బ్యాంక్ ఏ కంపెనీకి చెందింది? అందులో మంటలు చెలరేగడానికి బ్యాటరీ శార్ట్ సర్క్యూటా లేక నాణ్యత లోపమా? అనే కోణంలో విచారణ చేపట్టారు. ప్రయాణికులను ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా వారి గమ్యస్థానానికి చేరవేసేందుకు ఇండిగో సంస్థ చర్యలు చేపట్టింది. విమానాల్లో ప్రయాణించేటప్పుడు ప్రమాదకరమైన ఎలక్ట్రానిక్ వస్తువులు, లిథియం బ్యాటరీల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Chiranjeevi : అమిత్ షాతో చిరు, చరణ్ భేటీ
-
Rice Price Fraud : బియ్యం దందాకు చెక్.. హైదరాబాద్‌లో 11 కేసులు.!
-
Sharad Pawar: ఛాతి నొప్పితో ఆస్పత్రిలో చేరిన శరద్ పవార్!
-
AP Govt: అసైన్డ్, ఇనాం, పట్టా భూముల రైతులకు ఊరట.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం..
-
Nagarjuna King 100: ఐకానిక్ జోడీ ఈజ్ బ్యాక్: కానీ ఈసారి ‘ప్రేమ’ లేదు!
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!