Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
- హైదరాబాద్‌లో బ్రిలియన్స్ ఏఐ సాఫ్ట్వేర్ ఆవిష్కరణ
- ప్రశ్నాపత్రాల తయారీ నుంచి మూల్యాంకనం వరకు సేవలు
- విద్యార్థుల ప్రగతిపై తల్లిదండ్రులకు నివేదికలు
- ఏఐ వినియోగంలో డేటా భద్రత కీలకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యా సంస్థల నిర్వహణ, బోధన , అభ్యాస ప్రక్రియల్లో విప్లవాత్మక మార్పులు తేవడమే లక్ష్యంగా హైదరాబాద్‌లో ప్రత్యేకంగా రూపొందించిన ‘బ్రిలియన్స్ AI’ (Brilliance AI) విద్యా సాఫ్ట్వేర్ సూట్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారికంగా ప్రారంభించారు. బంజారాహిల్స్‌లోని తాజ్ డెక్కన్ హోటల్లో శనివారం ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ఈ ఏఐ టూల్‌ను ఆవిష్కరించారు. ప్రశ్నాపత్రాల రూపకల్పన నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం (Evaluation) వరకు సమగ్రమైన సేవలను ఈ సాఫ్ట్వేర్ అందిస్తుంది. అంతేకాకుండా విద్యార్థుల సందేహాల నివృత్తికి టెక్స్ట్, వాయిస్ ఆధారిత మద్దతు ఇవ్వడంతో పాటు, వారి అకడమిక్ ప్రగతిపై తల్లిదండ్రులకుప్పటికప్పుడు ఎప్పటికప్పుడు సమగ్ర నివేదికలు అందించే సాంకేతికతను ఇందులో పొందుపరిచారు.
సాంకేతికతతో విద్యా వ్యవస్థ విస్తరణ.. డేటా లీకేజీలపై హెచ్చరిక
ఈ ఆవిష్కరణ సభలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. విద్యా రంగంలో సాంకేతిక పరిజ్ఞానం కీలకమైన మార్పులు తీసుకొస్తోందని, ఏఐ ఆధారిత సాధనాలు విద్యార్థుల అభ్యాస ప్రక్రియను మరింత సరళంగా, సమర్థవంతంగా మారుస్తాయని కొనియాడారు. ఎడ్యుటెక్ 2025 సర్వే ప్రకారం సాంకేతికతను ఉపయోగిస్తున్న పిల్లల్లో 77 శాతం మంది ప్రాక్టీస్ , నేర్చుకోవడానికే డిజిటల్ సాధనాలను వాడుతున్నారని ఆయన గుర్తుచేశారు. సంప్రదాయ బోధనా విధానాలకు సాంకేతికతను జోడించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. అయితే దేశంలో ఇటీవల వెలుగుచూసిన నీట్ (NEET) పేపర్ లీక్ వంటి సంఘటనల తర్వాత.. విద్యా సంస్థల్లో డేటా భద్రత , రక్షణ ప్రాధాన్యత మరింత పెరిగిందని ఆయన నొక్కిచెప్పారు.
Also Read
- Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
- CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
- Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
డేటా గోప్యత, భద్రతకే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం
సాంకేతికత ఎంత వేగంగా విస్తరిస్తున్నప్పటికీ, డిజిటల్ వ్యవస్థల భద్రత , డేటా ప్రైవసీని కాపాడటం అత్యంత కీలకమని మంత్రి స్పష్టం చేశారు. డేటా సెంటర్ల ఏర్పాటు , నిర్వహణలో డేటా భద్రత, గోప్యతలే ప్రధాన ప్రమాణాలుగా ఉండాలని ఉద్ఘాటించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే సమయంలో ఏఐ సాధనాలు ఎంతవరకు బాధ్యతాయుతంగా, పారదర్శకంగా, జవాబుదారీతనంతో పనిచేస్తున్నాయో ప్రతి ఒక్కరూ పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. డేటా రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు.
బాధ్యతాయుతమైన ఏఐ వినియోగానికి పిలుపు
ఏఐ సాంకేతికత తెచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవడంతో పాటు, దాని ద్వారా ఎదురయ్యే సవాళ్లపైనా నిరంతరం దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. విద్యార్థులకు, విద్యా సంస్థలకు నిజమైన ప్రయోజనం చేకూర్చే బాధ్యతాయుతమైన డిజిటల్ పరిష్కారాలను ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని చెప్పారు. సాంకేతిక ఆవిష్కరణలు సామాజిక శ్రేయస్సుకు, విద్యాభివృద్ధికి దోహదపడేలా డిజిటల్ భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ముందుకుసాగాలని ఐటీ నిపుణులకు, ఎడ్యుటెక్ సంస్థలకు మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
-
Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..