Gas Cylinder Racket : హైదరాబాద్‌లో అక్రమ గ్యాస్ దందా.. 750 సిలిండర్లు సీజ్.!
- టాస్క్‌ఫోర్స్‌కు చిక్కిన అక్రమ మినీ గ్యాస్ ముఠా
- బొలేరోలో 400 సిలిండర్లు.. పోలీసులకు షాక్
- రాజాపూర్ గోదాములో అక్రమ తయారీ కేంద్రం
- నలుగురు అరెస్ట్.. ప్రజలకు పోలీసుల హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gas Cylinder Racket : హైదరాబాద్ నగరంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మినీ గ్యాస్ సిలిండర్లను తయారు చేస్తూ, రవాణా చేస్తున్న ఒక అంతర్రాష్ట్ర ముఠా గుట్టును రాజేంద్రనగర్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. గత రెండేళ్లుగా నగరంలో నిత్యం వేయికి పైగా మినీ సిలిండర్లు తయారు చేసి, గ్యాస్ నింపి బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్న ఈ ముఠాలోని నలుగురు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మొత్తం 750 మినీ గ్యాస్ సిలిండర్లు, ఒక బొలేరో వాహనం , 7 సిలిండర్ల తయారీ యంత్రాలను సీజ్ చేశారు.
తనిఖీల్లో దొరికిన బొలేరో.. వెలుగులోకి దిగ్భ్రాంతికర విషయాలు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఈ నెల 12వ తేదీన అందిన పక్కా సమాచారంతో శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలోని గగన్ పహాడ్ మెయిన్ రోడ్డు వద్ద రాజేంద్రనగర్ జోన్ టాస్క్‌ఫోర్స్ బృందం ఒక బొలేరో వాహనాన్ని తనిఖీ చేసింది. రాజాపూర్ నుండి హైదరాబాద్‌కి 400 మినీ గ్యాస్ సిలిండర్లను అక్రమంగా రవాణా చేస్తున్న మహమ్మద్ అబ్దుల్ హన్నాన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా, మహమ్మద్ భోలేషా సూచనల మేరకు వీటిని రవాణా చేస్తున్నట్లు తెలిపాడు. భోలేషాను పట్టుకోగా, ట్రూప్ బజార్‌కు చెందిన మహమ్మద్ షకీల్ ద్వారా ఈ సరఫరా జరుగుతోందని వెల్లడైంది. దాంతో షకీల్‌ను కూడా అరెస్ట్ చేసి ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
Also Read
రాజాపూర్ గోదాముపై దాడి.. తయారీ కేంద్రం సీజ్
షకీల్‌ను లోతుగా విచారించడంతో రాజాపూర్ గ్రామంలోని ఒక గోదాములో ఎలాంటి పత్రాలు లేకుండా అక్రమంగా మినీ గ్యాస్ సిలిండర్ల తయారీ యూనిట్ నడుపుతున్నట్లు బయటపడింది. వెంటనే టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆ తయారీ కేంద్రంపై దాడి చేసి, ఢిల్లీలోని మోతీనగర్‌కు చెందిన కార్మికుడు ఎండీ దిల్షాద్ను అరెస్ట్ చేశారు. అక్కడ సిలిండర్ల తయారీకి ఉపయోగిస్తున్న 7 యంత్రాలు, మరో 350 మినీ సిలిండర్లను సీజ్ చేసి రాజాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ రెండు కేసుల్లో కలిపి నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, భారీగా సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
అధికారుల అభినందనలు.. ప్రజలకు హెచ్చరిక
హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ ఐపీఎస్ పర్యవేక్షణలో, డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, అడిషనల్ డీసీపీ కే.ఎస్. రావు మార్గదర్శకంలో ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించిన ఆర్జీఐఏ ఇన్స్పెక్టర్ బి. సంజీవులు, టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె. రవి , సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.
ఈ సందర్భంగా రాజేంద్రనగర్, శంషాబాద్ జోన్ల అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. గ్యాస్ సిలిండర్లను కేవలం లైసెన్స్ ఉన్న అధికారిక డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలని, రోడ్డు పక్కన లేదా గుర్తింపు లేని షాపుల్లో కొంటే ప్రమాదకరమని హెచ్చరించారు. భద్రతా సర్టిఫికేషన్ లేని సిలిండర్లు వాడటం ప్రాణాలకే ముప్పని, ఎక్కడైనా అక్రమంగా సిలిండర్లు తయారు చేసినా లేదా విక్రయించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
తాజావార్తలు
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..