Raju Saved From The Cave: కామారెడ్డి జిల్లాలో పులిగుట్ట అడవిలో వేటకు వెళ్లి మొన్న గుహలో చిక్కుకున్న రాజు ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడ్డాడు. రామారెడ్డి మండలం రెడ్డిపేటకు చెందిన చాడ రాజు మంగళవారం మధ్యాహ్నం రాళ్ల గుట్టల సందుల్లో ఇరుక్కుపోయాడు. ఈనేపథ్యంలో దాదాపు 43 గంటలకు పైగా నరకయాతన అనుభవించాడు రాజు. అయితే రాజును బయటకు తీసుకురావడానికి అధికార యంత్రాంగం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. దీంతో.. తీవ్రంగా శ్రమించిన అధికార యంత్రాంగం కొద్దిసేపటి క్రితం రాజును బయటకు తీశారు. అనంతరం చికిత్స కోసం రాజును కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు పోలీసులు. అయితే రాజు క్షేమంగానే ఉన్నారని చెబుతున్నారు. ఆస్పత్రిలో పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం రాజు ఆరోగ్య పరిస్థితిపై పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Read also: Karnataka: స్కూల్ హెడ్‌మాస్టర్‌ని చితక్కొట్టిన అమ్మాయిలు..
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామానికి చెందిన షాడ రాజు మంగళవారం సాయంత్రం వేట కోసం అడవి వైపు వెళ్లాడు. అయితే ఘన్‌పూర్ తండా మీదుగా సింగరాయపల్లి అటవీ ప్రాంతంలో తిరుగుతుండగా ఓ చోటు రాళ్ల గుట్టపై ఏదో జంతువు కనిపించినట్లు అనిపించింది.. ఆరాళ్లపైకి వెళ్లి వెతుకుతున్న సమయంలో తన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ జారిపోయి రాళ్లమధ్యలో పడిపోయింది దీంతో ఆఫోన్ అందుకునే క్రమంలో రాజు జారి రాళ్లమధ్యలో ఉన్న గుహలో పడిపోయాడు. లోతైన రంధంలో పడిపోయి బయటకు వచ్చే అవకాశం లేక కాపాడండి ప్లీజ్.. ఎవరైనా ఉన్నారా? అంటూ ఆర్తనాదాలు చేస్తూ రాత్రంతా అక్కడే ఉండిపోయాడు. రాత్రైనా రాజు ఇంటికి రాలేకపోయే సరికి కుటుంబ సభ్యులు అడవంతా గాలించారు అయినా రాజు జాడ దొరకలేదు.
Read also: Komatireddy Venkat Reddy: ప్రధానితో భేటీ కానున్న కోమటిరెడ్డి వెంకట్.. కారణమిదీ!
బుధవారం మధ్యాహ్నం రాళ్ల మద్యలో నుంచి అరుపులు రావడంతో అటువైపు వచ్చి చూశారు రాళ్లమధ్యలో రాజు పడిపోయినట్లు గుర్తించారు. గ్రామస్థుల సాయంతో బయటకు తీసేందుకు ప్రత్నించిన రాజును బయటకు తీయలేకపోయారు. చివరకు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆరంధ్రం ద్వారా రాజుకు తొలుత మంచినీళ్లు, ఓఆర్‌ఎస్ అందించారు. ఆతర్వాత బయటకు తీసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. అనంతరం జేసీబీ, ఫైరింజన్ ను అక్కడికి రప్పించారు..ఈలోగా చీకటి పడటం సహాయ కార్యక్రమాలకు ఇబ్బందిగా మారింది. గుహలో ఇరుక్కుపోయి 24 గంటలుగా నరకయాతన అనుభవిస్తున్న రాజును బయటకు తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేసి బయటకు తీశారు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.