Komatireddy Venkat Reddy: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ నెల 16న ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన పార్లమెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై చర్చించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. మూసీ నది ప్రక్షాళనకు రూ.3 వేల కోట్లు ఇవ్వాలని మోదీని కోరనున్నారు. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి విస్తరణతో పాటు నమామి గంగానది తరహాలో పూడిక మట్టిని శుభ్రం చేసే అంశంపై కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రధానితో చర్చించనున్నారు. ఎంఎంటీసీ, మెట్రో రైలు పనులపై కూడా వెంకట్ రెడ్డి చర్చించనున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిన్న ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై చర్చించారు. అయితే..మరోవైపు రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చర్చించారు.
Read also: Shraddha Walkar: శ్రద్ధా వాకర్ హత్యలో కీలక పరిణామం.. డీఎన్ఏ ఫలితాలు చెప్తున్నది ఇదే..
ఎన్నికలకు నెల రోజుల ముందు రాజకీయాల గురించి మాట్లాడతానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మూడు రోజుల క్రితం ప్రకటించారు. తాను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని చెప్పారు. అయితే.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి ఈ ఏడాది ఆగస్టు 4న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తన సోదరుడు కాంగ్రెస్ పార్టీని వీడినా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
Read also: Rajinikanth At Ameenpeer dargah: అమీన్ పీర్ దర్గాలో రజనీకాంత్, రెహమాన్ సందడి
ఈ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు చెప్పిన ఆడియో సంభాషణ వైరల్‌గా మారింది. గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేయలేదు. ఎన్నికల సమయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు. ఈ సమయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ గెలవదని వెంకట్ రెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమాధానమిచ్చారు. ఈ పరిణామాల కారణంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.
Chiranjeevi V/s Balakrishana: బాలయ్యపై చిరంజీవి పై చేయి సాధించారా!?