కామారెడ్డి జిల్లాలో అటవీప్రాంతంలో వేటకు వెళ్లిన రాజు అనే వ్యక్తి ప్రమాదవశాత్తు బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయిన సంగతి తెలిసిందే. బండరాళ్ల మధ్య సెల్ ఫోన్ పడిపోవడంతో తీసుకునేందుకు యత్నించిన రాజు... తిరిగి బయటకు రాలేకపోయాడు. పెద్ద బండరాళ్ల మధ్య తలకిందులుగా చిక్కుకుపోయాడు
కామారెడ్డి జిల్లాలో పులిగుట్ట అడవిలో వేటకు వెళ్లి మొన్న గుహలో చిక్కుకున్న రాజు ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడ్డాడు. రామారెడ్డి మండలం రెడ్డిపేటకు చెందిన చాడ రాజు మంగళవారం మధ్యాహ్నం రాళ్ల గుట్టల సందుల్లో ఇరుక్కుపోయాడు. ఈనేపథ్యంలో దాదాపు 43 గంటలకు పైగా నరకయాతన అనుభవించాడు రాజు.