ఖమ్మం జిల్లా బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర లీగల్ సెల్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ రవీందర్ విశ్వనాథ్ మాట్లాడుతూ.. బండి సంజయ్ ఆదేశానుసారం వచ్చి సాయి గణేష్ కుటుంబాన్ని పరామర్శించడం జరిగిందని ఆయన తెలిపారు. సాయి కుటుంబం అత్యంత నిరుపేద కుటుంబమని, సాయి గణేష్ సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు ప్రశ్నించడం అతని తప్పా అని ఆయన అన్నారు. మజ్దూర్ సెల్ జిల్లా అధ్యక్షుడిగా టీఆర్‌ఎస్ పార్టీ తప్పులను ఎత్తి చూపడం అతని తప్పా అని ఆయన ప్రశ్నించారు. సాయి పై తప్పుడు కేసులు పెట్టి మానసికంగా, భౌతికంగా హింసించారని ఆయన ఆరోపించారు.
వీటన్నిటికీ తట్టుకోలేక సాయి ఆత్మ హత్య చేసుకున్నాడని, స్థానిక పోలీస్‌లు మీద మాకు నమ్మకం లేదని, సీబీఐతో ఎంక్వైరీ చేయించాలని రాష్ట్ర భ్రభుత్వన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. స్థానిక పోలీసులు, కార్పొరేటర్ భర్త ప్రసన్న మంత్రి పువ్వాడ అజయ్ వల్లే సాయి చనిపోయాడు అని వల్ల అమ్మమ్మ మాకు తెలిపిందన్నారు. బీజేపీ మీద పెరుగుతున్న ప్రజా ఆదరణను తట్టుకోలేక కార్యకర్తల మీద టీఆర్ఎస్ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు.