ఇటీవల బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్యకు పాల్పడడంతో.. కారణం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అంటూ.. బీజేపీ నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే.. తాజాగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. జిల్లా తాను చేస్తున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక, కాళ్లలో కట్టెలు పెట్టేందుకు కొన్ని పార్టీల నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇక్కడి ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇస్తున్న తప్పుడు సమాచారంతో హైదరాబాద్‌కు చెందిన కొందరు దరిద్రులు కట్టుకథలు, ఆరోపణలు మొదలుపెట్టారని అగ్రహం వ్యక్తం…
మరోసారి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మంత్రులపై విమర్శలు గుప్పించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కక్షపూరితమైన రాజకీయం నడుస్తుందన్నారు. ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, సోషల్ మీడియా పై నిర్బంధం పెరిగి పోయిందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, మంత్రుల వేధింపులు విపరీతంగా పెరిగాయని ఆయన ఆరోపించారు. రైస్, లిక్కర్, మైన్స్, సాండ్, ల్యాండ్ మాఫియా విచ్చలవిడిగా సాగుతోందని, మళ్ళీ గెలుస్తామో లేదో.. ఉన్నప్పుడు దోచుకుందామని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నం చేస్తారన్నారన్నారు. ఖమ్మం బీజేపీ…
సర్ఫ్ ఎక్సెల్.. యాడ్ లో మరక మంచిదేనంటారు. అక్కడ పోలీస్ శాఖలో పోస్టింగ్ లు రావాలంటే మరక ఉండాల్సిందేనంట. మరక ఉంటే మాత్రం వారికి మంచి పోస్టింగ్ పక్కానట. లేకపోతే ప్రమోషన్లుండవు… డిమోషన్లేనట. అందుకే ఆ నేతలు చెప్పినట్లుగా ఎవ్వరి మీద పడితే వారి మీద, అవసరం ఉన్నా లేకపోయిన కేసులు పెడుతున్నారట. కొందరు పోలీసుల్లో ఎందుకీ విపరీత ధోరణి? మరక కోసం ఆ జిల్లా రక్షకభటుల ఆరాటం విమర్శలపాలవుతోంది. ఖమ్మం జిల్లాలో ప్రజా ప్రతినిధులు కొందరు,…
ఇటీవల ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్న సాయి గణేష్ కుటుంబానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ తరుపున రూ. 8లక్షల రూపాయల చెక్కులు అందజేశారు. అంతేకాకుండా సాయి గణేష్ కుటుంబానిక అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సాయి గణేష్ ని తెచ్చి ఇవ్వలేక పోయాన అండగా ఉంటామన్నారు. సాయి గణేష్ మృతి చాలా దురదృష్టకరమని, ఇది నిజాం రాజ్యం కాదు…కుటుంబ రాజకీయాలు తెలంగాణ లో తెస్తామంటే ఒప్పు కోరన్నారు. హుజూరాబాద్ లో వందల కోట్లు ఖర్చు పెట్టారు…
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాయి గణేష్ ఆత్మహత్యపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. మహా సంగ్రామ యాత్రలో ఉన్న.. సాయి గణేష్ ఆత్మహత్య చాలా బాధాకారమని ఆయన అన్నారు. టీఆర్ఎస్, మంత్రి, పోలీసులు సాయి గణేష్‌ను ఆత్మహత్య చేసుకునేలా చేశారని ఆరోపించారు. సాయి గణేష్‌ది ప్రభుత్వ హత్య అని ఆయన మండిపడ్డారు. కాషాయం జెండా రెపరెపల కోసం సాయి గణేష్ కృషి చేశాడని, ప్రజాస్వామ్య బద్దకంగా, న్యాయ పోరాటం చేశాడన్నారు. అక్రమ…
తెలంగాణ వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారిన సాయి గణేష్ ఆత్మహత్యపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. శుక్రవారం ఆయన వైరాలో కమ్మ కళ్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జరిగింది చిన్నవిషయమే అయినా.. దాన్ని అడ్డం పెట్టుకొని కొందరు నాపై కుట్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర మంతి వర్గం నుంచి తనను తప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. అయితే పువ్వాడ వ్యాఖ్యలు టీఆర్‌ఎస్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే ప్రతిపక్షాలు…
ఖమ్మం జిల్లా బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర లీగల్ సెల్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ రవీందర్ విశ్వనాథ్ మాట్లాడుతూ.. బండి సంజయ్ ఆదేశానుసారం వచ్చి సాయి గణేష్ కుటుంబాన్ని పరామర్శించడం జరిగిందని ఆయన తెలిపారు. సాయి కుటుంబం అత్యంత నిరుపేద కుటుంబమని, సాయి గణేష్ సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు ప్రశ్నించడం అతని తప్పా అని ఆయన అన్నారు. మజ్దూర్ సెల్ జిల్లా అధ్యక్షుడిగా టీఆర్‌ఎస్ పార్టీ తప్పులను ఎత్తి…