Journalist Murder: అవినీతిని వెలికి తీసిన జర్నలిస్ట్ హత్య.. ముగ్గురి అరెస్ట్..
- అవినీతిని వెలికి తీసిన జర్నలిస్ట్ హత్య..
- ఛత్తీస్‌గఢ్ బీజాపూర్‌లో కాంట్రాక్టర్ దారుణం..
- హైదరాబాద్‌లో ముగ్గురు నిందితుల అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Journalist Murder: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ హత్య సంచలనంగా మారింది. అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంట్రాక్టర్ ఆవరణలోని సెప్టిక్ ట్యాంక్ నుంచి 28 ఏళ్ల చంద్రకర్ మృతదేహం లభ్యమైంది. స్థానిక న్యూస్ ఛానెల్‌లో పనిచేసిన ముఖేష్ చంద్రకర్ జనవరి 3న బీజాపూర్ జిల్లాలో శవమై కనిపించారు. జనవరి 1 రాత్రి నుంచి కనిపించకుండా పోయిన ముఖేష్, కాంట్రాక్టర్ సురేష్ చంద్రకర్ అవినీతిని బయటకు తెచ్చాడు. బస్తర్ జిల్లాలో రూ.120 కోట్ల రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలను బయటపెట్టాడు. దీంతో ప్రభుత్వం కాంట్రాక్టర్ కార్యకలాపాలపై విచారణ ప్రారంభించింది.
కాంట్రాక్టర్ సురేష్ చంద్రకర్, జర్నలిస్టు ముఖేష్ చంద్రకర్‌లు కలిసేందుకు సమావేశం ఏర్పాటు చేయబడింది. ఈ సమావేశం తర్వాత నుంచి ముఖేష్ మొబైల్ ఫోన్ స్విచ్ఛాప్ కావడంతో అడి అన్నయ్య యుకేష్ చంద్రకర్ మిస్సింగ్ ఫిర్యాదు దాఖలు చేశారు. జనవరి 3న చట్టన్‌పరాలోని సురేష్ ప్రాపర్టీలో ముఖేష్ మృతదేహం దొరికింది.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
Read Also: Komatireddy Rajgopal Reddy : బీఆర్‌ఎస్‌పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
‘‘ జనవరి 1న, ముఖేష్ తప్పిపోయాడని బాధితుడి సోదరుడు మాకు తెలియజేశాడు. మేము చర్యలు ప్రారంభించాము. సీసీటీవీ ఫుటేజీ స్కాన్ చేశాము. అతని లాస్ట్ లొకేషన్ కనుగొన్నాము. శుక్రవారం సాయంత్రం సెప్టిక్ ట్యాంక్‌లో ముఖేష్ మృతదేహాన్ని కనుగొన్నాము’’ అని పోలీసులు తెలిపారు. సురేష్ చంద్రకర్ సోదరులు దినేష్ చంద్రకర్, రితేష్ చంద్రకర్ సహా ముగ్గురిని హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. సురేష్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. కాంట్రాక్టర్ సర్కిల్స్‌కి చెందిన పలువురు అనుమానితులను ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
జర్నలిస్ట్ హత్యను ఛత్తీస్‌గఢ్‌లోని బీజేపీ సర్కార్ సీరియస్‌గా తీసుకుంది. ముఖ్యమంత్రి విష్ణదేవ్ సాయ్ తన సంతాపాన్ని తెలిపారు. బీజాపూర్‌కి చెందిన యువకుడు, అంకితభావం కలిగిన జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ హత్య చాలా బాధాకరం, నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని, వీలైనతంత త్వరగా నేరస్తులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన సీఎం ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!