MLA Aadi Srinivas: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. వాడు వీడు అంటే మేము కూడా వాడు వీడు అనాల్సి వస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి తాత వరకు ఎందుకు కేటీఆర్ అని మండిపడ్డారు. మొన్నటి ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి మీ అయ్య (కేసీఆర్)ను కుర్చీలో నుంచి దింపి ఫామ్‌హౌస్‌కి పరిమితం చేయడాన్నీ మరిచిపోయావా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య పంతాలో విమర్శిస్తే మేము స్వాగతిస్తాం స్వీకరిస్తాం అన్నారు. భూతులు మాట్లాడితే మేము మాట్లాడతామన్నారు. అసెంబ్లీ సమావేశాలలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను వచ్చి సూచనలు సలహాలు ఇవ్వమంటే ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు.
Read also: KTR Tweet: కొద్ది రోజులు రెస్ట్ కావాలి.. కేటీఆర్ సంచలన ట్వీట్..
సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సిరిసిల్ల పాలిస్టర్ అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ఇంఛార్జి కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రముఖులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన ప్రముఖ వస్త్ర వ్యాపారస్తులు రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా వారికి స్వాగతం పలుకుతున్నా అన్నారు. అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ రోజు నుండి వారు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, వారి యోగ క్షేమాలు కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చూస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతాని కృషి చేయాలన్నారు. నేడు మహబూబ్నగర్ లో రైతు పండగ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
Read also: V. Hanumantha Rao: బీసీలకు న్యాయం జరగాలంటే కుల గణన జరగాలి..
నేడు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఒక మార్పునకు నాంది అని ఎమ్మెల్యే తెలిపారు. గతంలో చెప్పినట్టుగానే జిల్లా అభివృద్ధి ఎక్కడ ఆగదన్నారు. ఎవరు కష్టాల్లో ఉన్న వారికి అండగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటుందన్నారు. గత ప్రభుత్వం పెట్టిన 270 కోట్ల బకాయిలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో, జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో నేతన్నలకు చెల్లించడం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వం బతుకమ్మ చీరల పేరిట నాసిరకం ఇచ్చిందని కీలక వ్యాఖ్యలు. వాటికి వ్యతిరేకిస్తూ మహిళా తల్లులకు చక్కటి చీరలు అందించే విధంగా కోటి పైగా చీరెలు నేతన్నలకు ఆర్డర్ ఇచ్చామన్నారు. 30 సంవత్సరాల నేతన్నల కళ యారన్ డిపోను ఏర్పాటు చేశామన్నారు.
Read also: Revanth Reddy Tweet: ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు.. సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ వైరల్..
గతంలో నేతన్నలు రెండు రాష్ట్రాలు దాటి వెళ్లి నూలు తీసుకురావాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. రూ.50 కోట్లతో చేనేత క్లస్టర్‌గా ఉన్న వేములవాడలో నూలు డిపోను ఏర్పాటు చేస్తున్నామన్నారు. గత పాలకులకు మన ప్రాంతంలో ఎవరైనా డిపో ఏర్పాటు చేయాలని ఆలోచన రాలేదన్నారు. నా చర్మం ఒల్సి మీకు చెప్పులు కొట్టిస్తానని గొప్ప గొప్ప మాటలు చెప్పి మన ప్రాంత ప్రజలపై మొసలి కన్నీరు కార్చారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో రెండవ స్థానంలో ఉండి యువరాజుగా చలామణి అయి నేతన్నలకు బకాయిలు పెట్టారన్నారు. బ్యూరో కాస్ట్‌లను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, జిల్లా కలెక్టర్‌ను కాంగ్రెస్ కార్యకర్తగా అభివర్ణించడం ఎంతవరకు సబబు? అని ప్రశ్నించారు.
Read also: EPFO: ఈ ఒక్కరోజే ఛాన్స్.. ఆ పని చేయకుంటే పీఎఫ్ బెనిఫిట్స్ ఆగిపోతాయి
కేటీఆర్ అధికారం పోయిన ప్రస్టేషన్, సిరిసిల్లలో తన పీఠాలు కదులుతున్నాయని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ నుంచి ముఖ్యమంత్రి వరకు వారిపై బూతులు మాట్లాడితే సగటు కాంగ్రెస్ కార్యకర్త చూస్తూ ఊరుకోడని హెచ్చరించారు. ఆనాడు జిల్లా కావాలని ఉద్యమకారులు ప్రజలందరూ రోడ్ ఎక్కినప్పుడు ఢిల్లీలో ఉండి జిల్లాగా చేయడం వీలు కాదని క్షమించండి అని బహిరంగ లేఖ రాశారని గుర్తుచేశారు. ఈరోజు సబ్బండ వర్గాల పోరాటం చేస్తే జిల్లా వస్తే.. జిల్లా కేంద్రంలో కల్పించాల్సిన మౌలిక సదుపాయాలను కల్పిస్తే,, జిల్లా వల్ల వచ్చిన అభివృద్ధిని మేము చేసాం అనడం శోచనీయం అన్నారు.
Read also: Beerla Ilaiah: గుట్కా తింటూ వంట చేస్తావా.. వంట మనిషిపై ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆగ్రహం
కేటీఆర్ తన భాషను మార్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. వారి హయాంలో పేదల భూములను లాక్కొని పెద్దలు పంచి పెట్టారని కీలక వ్యాఖ్యలు చేశారు. మీ కార్యకర్తలను కాపాడుకోవడానికి ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం చేస్తే ఊరుకోమన్నారు. మీ వల్ల జరిగిన పొరపాటును సరిదిద్దుతున్నామన్నారు. దళిత గిరిజనులకు చెందాల్సిన భూములు ఉన్నత వర్గాలకు చెందితే దానిని సరిదిద్దడం తప్పా? అని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. మొన్న కలెక్టర్ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఐఏఎస్‌ల సంఘం స్పందిస్తే వాటికి కేటీఆర్ ఇప్పటివరకు సమాధానం చెప్పలేదని అన్నారు. ఆయన భాష వల్ల సిరిసిల్ల ప్రాంతం పరువు పోకుండా కాపాడాల్సిన బాధ్యత ఉందని తెలిపారు.
DaDa : తెలుగులో ‘పా.. పా..’గా రాబోతున్న తమిళ బ్లాక్ బస్టర్ ‘డా..డా