EPFO: దాదాపు ప్రతి ఉద్యోగికి కచ్చితంగా ప్రావిడెంట్ ఫండ్ (PF) అకౌంట్ ఉండి ఉంటుంది. దీనిని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నిర్వహిస్తుంది. ఉద్యోగి వేతనం నుండి 12 శాతం కట్ అవుతూ.. పిఎఫ్ అకౌంట్ లో జమ అవుతూ ఉంటుంది. అదే సమయంలో ఉద్యోగి పని చేసుకున్న కంపెనీ కూడా 12% జమ చేయాల్సి ఉంటుంది. ఇందులో మొత్తనికి 8 శాతానికి పైగా ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ లోకి వెళుతుంది. అలాగే మరో మూడు శాతానికి పైగా పిఎఫ్ అకౌంట్ కి చేరుతుంది. ఇది ఇలా ఉండగా.. ప్రతి ఒక్క పిఎఫ్ అకౌంట్ కి ఓ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (UAN) తప్పనిసరిగా ఉంటుంది. పిఎఫ్ పోర్టల్ లోకి లాగిన్ అవ్వాలన్న ఇది కచ్చితంగా కావాల్సిందే.
Also Read: Fire Accident: వారణాసి రైల్వేస్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 200 బైక్స్
అయితే, ఈ యుఏఎన్ ఎప్పుడు యాక్టివ్ గా ఉండేలా చూసుకోవాలని ఈ మధ్యనే కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలివింది. దీనికి కారణం ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇంటెన్సివ్ స్కీం బెనిఫిట్స్ పొందినందుకు వీలుగా నిబంధన తెలిపింది. ఇందులో భాగంగా ఆధార్ ఓటిపి ద్వారా యూఏఎన్ యాక్టీవ్ చేసుకునేందుకు నేడు అంటే నవంబర్ 30 చివరి తేదీగా ఈపీఎఫ్ స్పష్టం చేసింది. కాబట్టి ఎవరైనా ఈ పనిని చేయకపోతే వెంటనే చేసేసుకోండి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగాలలో చేరిన వారందరూ యూఏఎన్ యాక్టీవ్ లో ఉంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అలా ఎవరికైతే యాక్టివ్ గా ఉంచారో వారికి మాత్రమే మొత్తాన్ని జమ చేస్తారని తెలిపింది.
Also Read: Temples Vandalized: చటోగ్రామ్‌లో మరో మూడు హిందూ దేవాలయాలపై దాడి