Pre Wedding Shoot: ఒకప్పుడు బంధువులు, స్నేహితుల సమక్షంలో పెళ్లిళ్లు జరిగేవి. కాలక్రమేణా ఆట్రెండ్ మారింది. ఇప్పుడు బంధువులు, స్నేహితులు జీవితాతం గుర్తుంచుకోవడానికి వీడియోలు తీయడం ప్రారంభించారు. ఆ తర్వాత మెల్లమెల్లగా ఒకరి తరువాత మరొకరు కాలానికి అనుగుణంగా పెళ్లికి కొత్త కొత్త కార్యక్రమాలు జోడిస్తున్నారు. అయితే అందరూ ఫాలో అయ్యేది ప్రీ వెడ్డింగ్ షూట్. పెళ్లికి ముందు.. ప్రీ వెడ్డింగ్ షూట్లతో వధూవరులతో సినిమా రేంజ్ లో పాటలు షూట్ చేస్తున్నారు. యువత కూడా ఈ ట్రెండ్ పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఈ ఫ్రీ వెడ్డింగ్ షూట్ కేవలం వధూవరులిద్దరి చిత్రాలను తీయడమే కాదు.. రకరకాల థీమ్స్, తగిన లొకేషన్లు… సినిమా రేంజ్ సెటప్‌లు, పాటల గెటప్‌లు ఉంటాయి. ఒకటి పొలాల దగ్గర రైతుల ఇతివృత్తంతో, మరొకటి బీచ్ థీమ్‌తో, మరొకటి కొండలు, గుట్టల థీమ్‌లతో చిత్రీకరిస్తున్నారు. మరికొందరు తమకు ఇష్టమైన ప్రేమగీతాలను రీక్రియేట్ చేస్తూ తమ సృజనాత్మకతను చాటుకుంటున్నారు. కొత్త ట్రెండ్ సెట్ చేయాలని ఎక్కడపడితే అక్కడ షూటింగ్స్ చేస్తున్నారు. అయితే కొందరు చేస్తున్న ఫ్రీ వెడ్డింగ్ షూట్ పై స్థానికులు మండిపడుతున్నారు. ఇదేం పైత్యం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అయితే.. తాజాగా హైదరాబాద్‌లోని రద్దీ రోడ్లపై ఓ జంట తీసిన ప్రీ వెడ్డింగ్ వీడియో.. ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది.
Read also: Komaram Bheem: కుమ్రం భీంజిల్లాలో రెండు పులులు మృతి.. పులి కళేబరాన్ని గుర్తించిన అటవీ శాఖ
హైదరాబాద్‌లో ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకున్న ఓ జంట ఆర్టీసీ బస్సును వదలకుండా వాడేసింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ పాట చిత్రీకరణలో వధూవరులను ప్రేమికులుగా చూపించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో… ఆర్టీసీ బస్సులో నుంచి వధువు దిగుతుండగా… వరుడు ఆమెను వెనుక నుంచి వెంబడిస్తున్న దృశ్యం చిత్రీకరించారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాంగ్ షూట్ బాగుందని పలువురు కొనియాడుతుండగా.. కొందరు నెటిజన్లు మాత్రం ఆర్టీసీ బస్సులో ఫోటోషూట్ చేశారని విమర్శిస్తున్నారు. ఇలాంటి వీడియో షూట్‌లకు ఆర్టీసీ బస్సులను ఉపయోగించడం వల్ల సామాన్యులకు అసౌకర్యం కలుగుతుందని, రోడ్డు భద్రతకు ఆటంకం ఏర్పడుతుందని, సమస్యలు తలెత్తుతాయని అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ బస్సులో షూటింగ్‌పై కొందరు విమర్శలు చేయగా, నగరంలో ట్రాఫిక్ సమస్యల్లో ఇదేమీ పెద్ద సమస్య కాదంటున్నారు కొందరు. కొత్త జంట క్యూట్ గా ఉంది.. కొంత మంది వారికి ఆల్ ది బెస్ట్ అంటున్నారు. మొత్తానికి ఈ వీడియో ప్రస్తుతం ఈ వీడియో హల్‌చల్ చేస్తోంది.
Maharashtra: నేడు మహారాష్ట్రలో సీట్ల పంపకాలపై చర్చ.. మహావికాస్ అఘాడీ నేతల కీలక భేటీ