గాంధీ ఆసుపత్రి అత్యాచార ఘటన పై గోపాలపురం ఏసీపీ వెంకట రమణ మాట్లాడుతూ… చిలకల గూడ పోలీస్ స్టేషన్ లో ఓ మహిళ తనపై అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేశారు. ఈ నెల 4న చికిత్స కోసం మహబూబ్ నగర్ జిల్లా నుంచి వచ్చిన బాధిత మహిళ ఆమె అక్క బావ తో గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈ నెల 4 నుండి గాంధీ ఆస్పత్రిలో బాధితురాలి బావ నరసింహులు అనే వ్యక్తి చికిత్స పొందుతున్నారు. రోగి నరసింహుల తో ఆయన భార్య చెల్లెలు ఇద్దరు రోగి బంధువులుగా గాంధీ లో ఉన్నారు అని చెప్పారు.
అయితే ఈ నెల 7 న ఏడవ అంతస్తు షిఫ్ట్ చేశారు నర్సింహులును..కిడ్నీ సమస్య తో నరసింహులు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.. ఈనెల 11వ తేదీన నరసింహులు సెల్ఫ్ డిశ్చార్జ్ అయి బయటికి వచ్చారు.. అప్పటినుండి నరసింహులు భార్య బాధిత మహిళ కనపడకుండా పోయారు.. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన దూరపు బంధువు గాంధీ ఆసుపత్రిలో ఎక్స్రే డిపార్ట్మెంట్లో టెక్నీషియన్గా పని చేస్తున్నా ఉమ మహేష్ అతని ద్వారా గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈనెల 15వ తేదీన గాంధీ మార్చురీ సమీపంలో ఉన్న ఓ చిన్న గల్లీలో వివస్త్రగా బాధిత మహిళ తాగిన మైకంలో పడి ఉంది. ఈమెను గమనించిన కొందరు నరసింహులు ఆసుపత్రిలో చేర్పించినా మహేష్ దృష్టికి తీసుకు వచ్చారు అని అన్నారు.
ఆ వెంటనే ఎక్స్-రే ల్యాబ్ టెక్నీషియన్ మహేష్ నరసింహులు కుమారుడికి సమాచారం అందించాడు. నరసింహులు కుమారుడు వచ్చి బాధిత మహిళ అడగ్గా తనను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేశారని వాపోయింది. మహబూబ్ నగర్ జిల్లాకు వెళ్లి అక్కడి నుండి పోలీసులు చిలకలగూడ పోలీస్ స్టేషన్ కు పంపారు మహబూబ్ నగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు అయినట్లు తమ దృష్టికి రాలేదు.. ఈరోజు మధ్యాహ్నం బాధిత యువతి చిలకలగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది వెంటనే ఫిర్యాదు స్వీకరించి విచారణ చేపట్టాము. బాధితురాలి స్టేట్ మెంట్ రికార్డ్ చేశము.. తదుపరి వైద్య పరీక్షలు విచారణ నిమిత్తం బాధిత మహిళలు భరోసా సెంటర్ కి పంపించామూ. ఈ కేసు దర్యాప్తు కోసం నాలుగు పోలీసు బృందాలు ఏర్పాటు చేశాము.. సీసీ కెమెరాలు కాల్ రికార్డు పరిశీలిస్తున్నామూ. బాధిత మహిళ పై అత్యాచారం జరిగిందా లేదా అనేది వైద్య పరీక్షల అనంతరం క్లారిటీ వస్తుంది. లాబ్ టెక్నీషన్ ఎక్స్ రే డిపార్ట్ మెంట్ ఉమ మహేశ్వర్ ను విచారిచము. సెక్యురిటి గార్డ్ తో పాటు ఇంకా ఈ కేసులో ఎవ్వరు ఉన్నారు అనే కోణంలో విచారణ చేస్తున్నాము.. గాంధీ ఆసుపత్రి నుండి బాధిత మహిళా అక్క ఎక్కడ వెళ్ళింది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాము. అక్కా చెల్లెలు ఇద్దరిని సెల్ఫ్ డిశ్చార్జి అయిన నరసింహులు వెతికాడు కానీ ఆచూకీ లభించలేదు.. తమ విచారణలో మహిళలు అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ కళ్ళు సేవించే అలవాటు వున్నట్లు బాధిత మహిళ తెలిపింది.. కేసు నమోదు చేసుకుని వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నము అని తెలిపారు.