Ganja Seller: అతను ఓ పానీపూరీ వ్యాపారి. బాగానే సాగుతున్న అతని వ్యాపారంలో కొత్తగా ఇంకోవ్యాపారం మొదలు పెట్టాడు ప్రభుద్దుడు. అతితెలివి ఉపయోగించి పానీపూరీ చాటున అక్రమ దందాను మొదలుపెట్టాడు. ఈజీ మనీ సంపాదన కోసం గంజాయి అమ్మకం షురూ చేశాడు. చివరకు అడ్డంగాబుక్కై కటకటాలపాలయ్యాడు. గుట్టుచప్పుడు కాకుండా గత కొంత కాలంగా చీకటి వ్యాపారం చేస్తుండటంతో.. పక్కా సమాచారం మేరకు దాడి చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ అబిడ్స్ ప్రాంతానికి చెందిన ముస్తాపూర్ ప్రశాంత్ అనే యువకుడు తాజ్‌మహల్ హోటల్ ఎక్స్ రోడ్డు, భారతి విద్యా భవన్ రోడ్డులో వేరు వేరు చోట్ల పానీ పూరి స్టాల్స్‌ను పెట్టి వ్యాపారం చేస్తున్నాడు. అయితే పానీపూరి అమ్మగా వచ్చిన డబ్బులతో జీవనం కొనసాగించటం ప్రశాంత్‌కు కష్టంగా మారింది. కష్టపడకుండా ఈజీగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు హైదరాబాదులో గంజాయికి ఎక్కువగా గిరాకీ ఉన్నట్లుగా గుర్తించాడు. గంజాయి విక్రయం ద్వారా తక్కువ కాలంలో సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయం తీసుకున్నాడు. పానీపూరి కోసం తన వద్దకు వచ్చే కాలేజీ స్టూడెంట్స్‌కు గంజాయిని విక్రయించాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే దూల్‌పేటకు చెందిన యశ్వంత్ గౌతమ్ అనే వ్యక్తి అతడికి పరిచయం అయ్యాడు. యశ్వంత్ గంజాయి స్మగ్లింగ్ చేస్తుండగా.. అతడి వద్ద నుంచి ప్రశాంత్ 25 వేలకు గంజాయిని కొనుగోలు చేశాడు.
అయితే.. ఆ గంజాయిని రూ. 45 వేలకు విక్రయించాలని ప్రశాంత్ నిర్ణయించుకున్నాడు. మంగళవారం తెల్లవారుజామున రామకృష్ణ థియేటర్ గేటు దగ్గరకు వచ్చి అవసరమైన వినియోగదారులకు గంజాయిని విక్రయించడానికి ప్రయత్నించాడు. కాగా.. పోలీసులకు విశ్వసనీయమైన సమాచారం రావటంతో వెంటనే సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ బృందం దాడి చేసి ప్రశాంత్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రశాంత్ దగ్గర ఉన్న బ్యాగును పరిశీలించగా అందులో బ్రౌన్ టేపుతో చుట్టబడిన గంజాయి ప్యాకెట్ కనిపించింది. దీంతో పోలీసులు వెంటనే ప్రశాంత్‌ను అరెస్టు చేసి 2.8 కేజీల గంజాయిని, ఒక సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రశాంత్‌కు గంజాయి విక్రయించిన యశ్వంత్ పరారీలో ఉండగా.. అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అంసాఘిక కార్యకలపాలు, చట్టవ్యతిరేకకలపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో డ్రగ్ ఫ్రీ సిటీగా మార్చేందుకు స్పెషల్ టీంలు ఏర్పాటు చేసినట్లు.. డ్రగ్స్, గంజాయి, మత్తుపదార్థాలపై ఉక్కుపాదం మోపుతున్నామని పోలీసులు తెలిపారు.
Aadhipurush : ఆదిపురుష్ లో ఆ సన్నివేశం మార్పు పై తీవ్ర ఆందోళన చెందుతున్న ఫ్యాన్స్..!!