దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ దందాను డీఆర్ఐ అధికారులు గుట్టు రట్టు చేశారు. డ్రగ్స్ తయారు చేసే పరిశ్రమపై అధికారుల బృందం దాడులు చేశాయి. రూ.108 కోట్ల విలువ చేసే డ్రగ్స్‌ను డీఆర్ఐ అధికారులు సీజ్ చేశారు.
గంజాయి రవాణాకు, సరఫరాకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్న విశాఖలో స్మగ్లర్ల ఆటకట్టించేందుకు పోలీసులు సరికొత్త ప్లాన్ వేసారు.. రైల్లలోను, బస్సుల్లోను, ఇతర వాహనాల్లో వందల కేజీల కొద్ది గంజాయిని గుట్టు చప్పుడు కాకుండా బోర్డర్లు దాటించేస్తున్నారు.. పెడ్లర్లు, స్మగ్లర్ల ఎత్తుగడలకు పోలీసుల సైతం ఆశ్చర్యపోతున్నారు.. బ్యాగుల్లో, మూటల్లో తరలిస్తున్న గంజాయిను పట్టుకోవడం కష్టతరం అవుతుంది. దీంతో నార్కోటిక్ స్పెషల్ ట్రైనింగ్ పొందిన డాగ్స్ స్క్వాడ్ ను రంగంలోకి దించారు విశాఖ పోలీసు అధికారులు...
అదనపు ఆదాయం కోసం చాలా మంది ప్రయత్నిస్తుంటారు. చిన్న చితకా ఉద్యోగాలు చేసే వారికి అయితే అదనపు ఆదాయం చాలా అవసరం ఉంటుంది. తద్వారా ఆర్ధికంగా బలపడదామని భావిస్తారు. కానీ కొంత మంది మాత్రం అదనపు ఆదాయం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. సరిగ్గా ఇదే రీతిలో ప్రయత్నించిన సెక్యూరిటీ గార్డులు ఏకంగా గంజాయి వ్యాపారం షురూ చేశారు. చివరకు పోలీసులకు దొరికిపోయారు. బీహార్‌కు చెందిన అర్జున్ కుమార్ అనే వ్యక్తి ఎడన్ బాగ్‌లో నివాసం ఉంటున్నాడు. అమృత…
కూర్చుని తింటే.. రాళ్లయినా కరిగిపోతాయి. ఆఫ్టర్ ఆల్ ఆస్తులు ఎంత? అనుకున్నాడో ఏమో.. భారీగా ఆస్తులు కూడబెట్టాలని, డబ్బులు సంపాదించాలని రంగంలోకి దిగాడు. ఇంత వరకు బాగానే ఉన్నా.. డబ్బు సంపాదన కోసం అతడు ఎంచుకున్న మార్గమే ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇంతకీ అతను డబ్బు ఎలా సంపాదిస్తున్నాడు? హవ్ ఏ లుక్. ఇతని పేరు.. రమేష్ గౌడ్. చేసేది వడ్డీ వ్యాపారం.. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో 4 భవనాలు ఉన్నాయి. వాటి ద్వారా అద్దె కూడా లక్షల్లో…
గంజాయి, డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటిస్తున్నా.. ఎవరైనా అడ్డొస్తే తొక్కుకుంటూ పోవడమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. గుంటూరులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.. నేను యువతకు ఒకటే చెబుతున్నా. ఎన్నికలకు ముందు కూడా చెప్పాను. రౌడీల తోక కత్తిరిస్తానని అన్నాను. రాయలసీమలో ముఠా కక్షలు. కుటుంబాలకు కుటుంబాలను చంపే పరిస్థితి. రాయలసీమలో ముఠాకక్షలను పూర్తిగా అణిచివేశాం. మతసామరస్యాన్ని కాపాడుతాం... విద్వేషాలు రెచ్చగొట్టే…
Hyderabad: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, మాదాపూర్‌లోని పలు పబ్‌లలో ఎస్‌వోటీ పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న క్లబ్ రఫ్ పబ్, ఫ్రూట్ హౌస్ లో పబ్బుల్లో సోదాలు నిర్వహించారు. తనిఖీల సమయంలో పబ్‌లోని యువత మత్తులో జోగుతున్నారు.
డ్రగ్స్‌ను ఎక్కడికి అక్కడ కట్టడి చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు.. కానీ గ్రామ స్థాయిల వరకు డ్రగ్స్ వాడకం పెరిగిపోయిందని అధికారులు గుర్తించ లేకపోతున్నారు.. ఏకంగా జాతీయ రహదారుల వెంబడి ఉన్న దాబాలు హోటల్స్‌లో ఈ డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతుంది..
Holi 2025 : హోలీ అంటేనే రంగురంగుల పండుగ ..ఈ పండుగ అంటానే మజా ఉంటుంది ..ఆ మజా వెనకాల కిక్కు ఒకటి ఉంటుంది ..మన భాషలో చెప్పాలంటే గంజాయి. గంజాయిని నేరుగా తీసుకుంటే అది నేరమవుతుంది.. అయితే హోలీ సమయంలో కిక్ వచ్చే రూపంలో తీసుకుంటే అది తిను పదార్థం అవుతుంది.. పాత బస్తీలో బేగంబజార్ దూలిపేట కార్వాన్ లాంటి ప్రాంతాల్లో కిక్కు వచ్చే గంజాయిని వివిధ రకాలుగా తయారుచేసి అమ్ముతుంటారు.. దానిమీద ఎప్పుడు అధికారులు…
ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలన్నదే తమ లక్ష్యం అని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. గంజాయిని సమూలంగా నిర్మూలించడానికి ఈగల్ టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేసి.. ఐజీ అధికారిని నియమించామన్నారు. నేరాల నియంత్రణలో టెక్నాలజీని మరింతగా వినియోగించుకునేలా.. మార్చి ఒకటి నాటికి లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు లక్ష్యంగా దృష్టి సారించామన్నారు. ఒడిస్సా సరిహద్దు మల్కాజ్గిరి ప్రాంతంలో గంజాయి సాగు ఉందని, గంజాయి పండించే గిరిజనులకు చైతన్య వంతం చేస్తున్నాం అని డీజీపీ చెప్పారు.…
హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో విదేశీ గంజాయి కలకలం రేపింది. ఆదివారం రాత్రి ప్రశాంతీ హిల్స్ టింబర్ లేక్ వ్యాలీ వద్ద గంజాయి విక్రయిస్తూ ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పట్టుపడ్డాడు. మరో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పరారయ్యాడు. నిందితుడి వద్ద నుంచి 170 గ్రాముల ఫారిన్ గంజాయి, 1 కేజీ లోకల్ గంజాయి, బైక్, మొబైల్ ఫోన్‌ను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీమ్ సీజ్ చేసింది. ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా…