గంజాయి రవాణాకు, సరఫరాకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్న విశాఖలో స్మగ్లర్ల ఆటకట్టించేందుకు పోలీసులు సరికొత్త ప్లాన్ వేసారు.. రైల్లలోను, బస్సుల్లోను, ఇతర వాహనాల్లో వందల కేజీల కొద్ది గంజాయిని గుట్టు చప్పుడు కాకుండా బోర్డర్లు దాటించేస్తున్నారు.. పెడ్లర్లు, స్మగ్లర్ల ఎత్తుగడలకు పోలీసుల సైతం ఆశ్చర్యపోతున్నారు.. బ్యాగుల్లో, మూటల్లో తరలిస్తున్న గంజాయిను పట్టుకోవడం కష్టతరం అవుతుంది. దీంతో నార్కోటిక్ స్పెషల్ ట్రైనింగ్ పొందిన డాగ్స్ స్క్వాడ్ ను రంగంలోకి దించారు విశాఖ పోలీసు అధికారులు...
హైదరాబాద్ మీదుగా ఇతర రాష్ట్రాలకు భారీగా గంజాయి తరలిస్తున్న ముఠాలు వరుసగా పట్టుబడుతున్నాయి. ప్రధానంగా ఒరిస్సా నుండి హైదరాబాద్ మీదుగా నార్త్ ఇండియాకు కిలోల కొద్ది గంజాయి తరలివెళుతుంది… ఈ గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఇప్పటికే నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు, ఎస్‌ఓటీ, లోకల్ పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఐనా, నిఘా కళ్లుగప్పి గంజాయి రవాణా కొనసాగుతోంది. తాజాగా 4 కోట్ల రూపాయల విలువైన హైగ్రేడ్ గంజాయిని పట్టుకున్నారు. Also Read:EPFO New Rule: యూఏఎన్ కోసం…
గంజాయి పెడ్లర్స్ భరతం పడుతోంది ఈగల్ టీమ్. గంజాయి, డ్రగ్స్ రవాణాకు పాల్పడుతున్న వారి పట్ల ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా హైదరాబాద్ లో ఈగల్ టీమ్ భారీగా గంజాయిని పట్టుకుంది. ఏకంగా రూ. 5 కోట్లు విలువైన 935 కిలోల గంజాయిని సీజ్ చేసింది. బాటసింగరం ఫ్రూట్ మార్కెట్ సమీపంలో ఈగల్ టీమ్ పట్టుకుంది. ఒడిశా నుంచి మహారాష్ట్ర కు తరలిస్తుండగా పట్టుకుంది. 35 సంచుల్లోని 455 గంజాయి ప్యాకెట్లు సీజ్ చేశారు. Also Read:XXX vs…
ఎక్సైజ్ అధికారులు దులో పేట్ లోని ఆ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు.. ఇంటి వాళ్ళందరూ ఎలాంటి ఐరానా పడకుండా ప్రశాంతంగా కూర్చున్నారు.. అందులో ఒకరు పూజ గదిలోకి వెళ్లి బ్రహ్మాండమైన పూజలు చేస్తున్నాడు.. అప్పటికి అధికారులకు అర్థం కాలేదు.. ఇల్లు మొత్తం వెతికినప్పటికీ ఎక్కడ కూడా గంజాయి ఆనావాళ్లు దొరకలేదు.. అరవీర భయంకరంగా పూజలు చేస్తున్న వ్యక్తిని అనుమానంగా చూశారు.. అప్పుడే అనుమానం వచ్చి అధికారులు పూజా గదిలోకి వెళ్లారు. Also Read:Pune: పూణె అత్యాచార కేసులో…
తూర్పు గోదావరి జిల్లా రాజానగరం పోలీసులు అక్రమ గంజాయి నిల్వ ఉంచి ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్న భార్యాభర్తలు, వీరికి సహకరిస్తున్న మరో ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి ఒక వ్యాన్, కారు, రెండు మోటారు సైకిల్లను, రేకుల షెడ్ సీజ్ చేసినట్లు తెలిపారు. గంజాయి కేసుకు సంబంధించిన వివరాలను రాజమండ్రి నార్త్ జోన్ డిఎస్పీ వై. శ్రీకాంత్ వెల్లడించారు. రాజానగరం మండలంలో కొండగుంటూరు కొండాలమ్మ గుడి సమీపంలో ప్రైవేట్ లే అవుట్…
గంజాయి, మాదకద్రవ్యాల కట్టడికి ప్రభుత్వాలు కఠిన చర్యలు అమలు చేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో అడ్డుకట్టపడడం లేదు. మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. గంజాయి మత్తులో నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా విజయవాడ బస్టాండ్ లో గంజాయి బ్యాచ్ హల్ చల్ చేసింది. శ్రీశైలం పవర్ ప్లాంట్ లో విధులు నిర్వహిస్తున్న అసిస్టంట్ సెక్రటరీ కృష్ణారావు పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. Also Read:Rajnath Singh: పాక్ వద్ద అణ్వాయుధాలు సురక్షితమా..? అంతర్జాతీయ జోక్యం అవసరం..!…
డ్రగ్స్ యువత జీవితాలను చిత్తు చేస్తోంది. మాదకద్రవ్యాల కట్టడికి ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడడం లేదు. హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. నార్కొటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, నల్లకుంటా పోలీసులు జాయింట్ ఆపరేషన్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. రూ.1.40కోట్ల విలువైన డ్రగ్స్, గంజాయి స్వాధీనం చేసుకున్నారు అధికారులు. నగర అడిషనల్ సీపీ విశ్వప్రసాద్ దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.. Also Read:NTR Neel: ఆ ఊరిలో ఎన్టీఆర్ – నీల్…
ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారితోపాటు అరవై కేజీల గంజాయి, ఎర్టిగా మారుతి కారును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో ఆత్కూరు పోలీస్ స్టేషన్ లో ఎస్పీ ఆర్ గంగాధర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అందిన సమాచారం మేరకు పొట్టిపాడు టోల్ గేట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఈనెల 20వ తారీఖున…
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ గంజాయి పట్టుబడింది. రూ.11.28 కోట్ల విలువ చేసే 11.28 కేజీల విదేశీ గంజాయిను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఫుడ్ ప్యాకెట్స్ ముసుగులో గంజాయి స్మగ్లింగ్ చేస్తుండగా పట్టుకున్నారు.
సాఫ్ట్వేర్ ఇంజనీర్ గంజాయి అమ్ముతూ పట్టుబడ్డాడు. కూకట్పల్లి ప్రాంతంలోని వసంత నగర్ బస్ స్టాప్లో భరత్ రమేష్ బాబు అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గంజాయి అమ్ముతూ ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులకు శుక్రవారం దొరికాడు. నిందితుడి నుంచి 1.1 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.