Pantangi Toll Plaza: మునుగోడు ఉప్ర ఎన్నికల్లో ధన ప్రవాహం జోరందుకుంది. మునుగోడు ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రజలను ప్రలోభాలకు గురి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా మునుగోడుకు డబ్బుల వరద కొనసాగుతుంది. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా 16 చెక్ పోస్టులను ఏర్పాటు చేసిన అధికారులు ప్రతిఒక్క వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేయకపోవడంతో యదేచ్ఛగా మునుగోడుకు డబ్బులు రవాణా అవుతున్నాయి.
read also: IT Employees: మరిన్ని రోజులు ఉండం.. మళ్లీ ఇటువైపు రాం.
మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో నల్గొండ జిల్లా వైపు వెళ్లే అన్ని వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. పంతంగి టోల్‌ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు చేశారు. టోల్ ప్లాజా వద్ద ఓ కారును తనిఖీ చేయగా.. పెద్ద మొత్తంలో నగదును గుర్తించారు…కారులో సుమారుగా రూ.20 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారులో.. నగదు తరలిస్తున్న అభిషేక్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మునుగోడు పోలీస్ స్టేషన్ పరిధిలో చల్మెడ క్రాస్ రోడ్డు చెక్ పోస్ట్ వద్ద నిర్వహించిన వాహన తనిఖీలలో ఓ కారులో కోటి రూపాయల నగదును తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నా డబ్బులు తరలించే వ్యవహారం మాత్రం ఆగడం లేదు. రెండురోజుల క్రితమే.. గట్టుప్పల్ శివారులో 19లక్షలు నగదును పట్టుకున్నారు అధికారులు. గట్టుప్పల్ నుంచి పుట్టపాక వెళ్ళే దారిలో పోలీసుల తనిఖీలు నిర్వహించారు. బ్రీజా కారులో 19 లక్షలు తరలిస్తుండటంతో పోలీసులు అడ్డగించారు. కారును ఆపి తనిఖీలు చేపట్టారు. కారులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
Namaz In Train: రైలులో నమాజ్.. వీడియో వైరల్.. రైల్వేకు ఫిర్యాదు