తెలంగాణలో ఏ పార్టీ ఏ ప్రభుత్వము ఇవ్వని కరెంటు ఉచితంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇస్తుందని రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మంచిర్యాల జిల్లా చెన్నూర్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీ ఉడుతా ఉపులకు ఎవరు భయపడ్డారు బండి సంజయ్ అని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్, బీజేపీ గాని ఎక్కడైనా ప్రాజెక్టులు కట్టారా అని ఆయన ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా రైతు చనిపోతే 5 లక్షలు ఇస్తుందని ఆయన వెల్లడించారు. బండి సంజయ్ తాటాకు చప్పుళ్ళకు ఎవరు భయపడరని ఆయన మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ ను తిడితే ఏం చేయలేని పరిస్థితిలో మీరు ఉన్నారని, మీరు కేసీఆర్ ను అంటారా ఖబర్దార్ రేవంత్ రెడ్డి అంటూ ఆయన వ్యాఖ్యానించారు.