Online Cricket Betting Gang Arrested: రాచకొండ కమిషనరేట్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఒక ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారం అందుకుని రంగంలోకి దిగిన ఎల్బీనగర్ SOT, చైతన్య పురి పోలీసులు.. జగదీష్, జక్కిరెడ్డి అశోక్ రెడ్డి, చరణ్ అనే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ. 20 లక్షల నగదు, ఏడు మొబైల్ ఫోన్స్‌ని స్వాధీనం చేసుకోవడంతో పాటు వివిధ బ్యాంకుల్లో ఉన్న రూ.1.42 కోట్లను ఫ్రీజ్ చేశారు. నిందితుల్ని మీడియా ముందు ప్రవేశపెట్టిన రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహన్.. ఈ కేసుకి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
RCB vs DC: ముగిసిన ఆర్సీబీ బ్యాటింగ్.. ఢిల్లీ క్యాపిటల్స్ ముందు 175 పరుగుల లక్ష్యం
‘‘రాచకొండ కమిషనర్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్ట్ చేశాం. ఎల్‌బి నగర్ SOT, చైతన్యపురి పోలీసులు ఈ ముఠాని ఆరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 20 లక్షల నగదును స్వాధీనం చేసుకోవడంతో పాటు వివిధ బ్యాంకుల్లో ఉన్న రూ.1.42 కోట్లను ఫ్రీజ్ చేశాం. ముగ్గురు నిందితులకు సంబంధించి ఏడు మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నాం. జగదీశ్, జక్కిరెడ్డి అశోక్ రెడ్డి, ఓడుపు చరన్‌లను ఆరెస్ట్ చేశాం. వీళ్లు ముగ్గురు హర్యానా నుండి బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి, నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. ఆన్‌లైన్‌లో బెట్టింగ్ నిర్వహిస్తే ఉపేక్షించేది లేదు. నకిలీ ఏజెంట్లతో అప్రమత్తంగా ఉండాలి’’ కమిషనర్ డీఎస్ చౌహాన్ చెప్పుకొచ్చారు.
Mallu Ravi: కేసీఆర్ దళిత వ్యతిరేకి.. మల్లు రవి ధ్వజం
మరోవైపు.. రూ.2 వేల నోటు రద్దు అవుతోంది, త్వరపడండి అంటూ మోసం చేస్తున్న గ్యాంగ్‌ని సైతం పోలీసులు పట్టుకున్నారు. అమాయకులను టార్గెట్ చేసిన ఈ ముఠా.. వారి వద్ద నుంచి ఒక కోటి 90 లక్షలు దోచుకుంది. త్వరలోనే రూ.2 వేల నోటు రద్దు అవుతోందని, మీ వద్ద ఉన్న 2 వేల నోటు ఇస్తే.. 20 శాతం అదనంగా 500 నోట్లు ఇస్తామని ఆ ముఠా మోసానికి పాల్పడింది. ఒక లక్ష ఇస్తే.. లక్షా 20 వేల విలులైన నోట్లు ఇస్తామంటూ వ్యాపారుల్ని నమ్మించి మోసం చేశారు. కోట్లు దండుకున్నాక పరారవ్వాలని ప్రయత్నించగా.. పోలీసులు వీరి ప్లాన్‌ని పటాపంచలు చేశారు. శ్రీకాళహస్తికి చెందిన షేక్ రోషన్ మహబూబ్, నార్సింగ్‌కి చెందిన కొలంపల్లి శ్రీనివాస్, ఉప్పల్‌కి చెందిన బింగి వాసు, ఎల్బీనగర్‌కి చెందిన సింగం శెట్టి రాములు అరెస్ట్ అయ్యారు.