క్రికెట్ బెట్టింగ్ భూతానికి మరో విద్యార్థి బలయ్యాడు. డబ్బులు అధికంగా వస్తాయన్న ఆశతో బెట్టింగ్‌లో పాల్గొన్న యువకుడు చివరికి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన కడప జిల్లా బుద్వేల్‌లో విషాదాన్ని నెలకొల్పింది. బుద్వేల్‌కు చెందిన పవన్ కుమార్ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లలో బెట్టింగ్‌కు లోనయ్యాడు. మొదట్లో స్వల్ప లాభాలు రావడంతో ఆశ పెరిగింది. ఆ తర్వాత పెద్ద మొత్తంలో అంటే సుమారు 80 వేలు బెట్టింగ్ పెట్టాడు. అయితే..…
ఆన్‌లైన్ గేమ్స్, ఐపీఎల్ బెట్టింగ్ వ్యసనం భారీన పడిన ఓ వ్యక్తి చేతిలో ఉన్న డబ్బంతా పోగొట్టుకున్నాడు. భూమి కొందామని దాచిన కోటిన్నర డబ్బును ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్ మాయలో పడి పోగొట్టాడు. డబ్బేదని కుటుంబ సభ్యులు అడగగా.. ఏమీ చేయలేని స్థితిలో ఉన్న సదరు వ్యక్తి చివరకు ఆత్మహత్యే దిక్కనుకున్నాడు. పురుగుల మందు తాగి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చేరాడు. ఈ ఘటన కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం రామన్నపాలెం గ్రామంలో వెలుగు చూసింది. వివరాలు…
IPL Betting: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ప్రారంభమైంది. మరోవైపు బెట్టింగ్ కూడా జోరుగా నడుస్తోంది. గతంలో బెట్టింగులకు పాల్పడి కోట్లలో డబ్బును కోల్పోయి, చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు చూశాము. తాజాగా మరోసారి అలాంటి ఘటనే చోటు చేసుకుంది. కర్ణాటకకు చెందిన దర్శన్ బాబు అనే ఇంజనీర్ బెట్టింగ్ ఊబిలో కూరుకుపోయాడు.
ఐపీఎల్ వచ్చిందంటే కేవలం క్రికెట్ వినోదం మాత్రమే కాదు.. బెట్టింగులు కూడా జోరుగా సాగుతాయి. ఎక్కువగా యువతే ఈ బెట్టింగులకు పాల్పడుతుంటారు. ఇందులో కొంతమందికి లాభలొస్తే మరికొందరూ తీవ్రంగా నష్టపోయి అప్పుల పాలవుతారు.
దేశమంతా ఐపీఎల్ ఫీవర్ నెలకొని ఉంది. అయితే ఐపీఎల్ మ్యాచ్‌లు బెట్టింగ్ రాయుళ్లకు అడ్డాగా మారాయి. దీంతో హైదరాబాద్ పోలీసులు క్రికెట్ బెట్టింగ్ స్థావరాలపై విస్తృతంగా దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న బుకీలను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. 18 మంది ఆర్గనైజర్‌లను, బుకీలను అదుపులోకి తీసుకున్నారు. ఏడుగురు బుకీలు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రూ.1.06 కోట్ల నగదు, 5 బెట్టింగ్ బోర్డులు, 7 ల్యాప్ టాప్‌లు,…