Rajamouli, Mahesh Movie Update: ట్రిపుల్ఆర్ సినిమా తర్వాత మహేశ్ బాబుతో సినిమా చేయబోతున్నట్లు రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అది కంప్లీట్ అయిన వెంటనే రాజమౌళితో సినిమా చేయబోతున్నారు. ప్రాజెక్ట్ అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ అటు మహేష్ బాబు ఇటు రాజమౌళి ఇద్దరూ కూడా తాము కలిసి సినిమా చేస్తున్నట్లు పలు సందర్భాల్లో వెల్లడించారు. ఈ ఏడాది ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజమౌళి.. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ని ఆస్కార్ బరిలో నిలబడిన నేపథ్యంలో పెద్ద ఎత్తున అమెరికాలో సినిమాని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు.
Read Also: Jabardasth New Anchor : జబర్దస్త్ కొత్త యాంకర్ కష్టాలు వింటే కన్నీళ్లు ఆగవు
ఈ సందర్భంగా అక్కడి ఇంగ్లీష్ మీడియా ఔట్‌లెట్‌తో రాజమౌళి మాట్లాడారు.. మహేష్ బాబుతో మీ తదుపరి సినిమా ఎలా ఉండబోతుంది అని అడిగిన మీడియా ప్రతినిధులకు ఇప్పుడే చెప్పడం కష్టమని చెప్పుకొచ్చారు. తనకు అడ్వెంచర్ థ్రిల్లర్స్ అంటే చాలా ఇష్టమని అందుకే ఈ సినిమాను ఒక గ్లోబ్ ట్రోటింగ్ అడ్వెంచర్ మూవీగా రూపొందించబోతున్నానని రాజమౌళి ప్రకటించారు. తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ రెండు నెలల క్రితం స్క్రిప్ట్ వర్క్‌ని స్టార్ట్ చేశారని… కానీ ఇప్పటికీ ఆ వర్క్ ప్రారంభ దశలోనే ఉంది. కాబట్టి ప్రస్తుతానికి కథని రివీల్ చేయలేనంటూ చెప్పారు. కానీ.. సినిమాలో ఇండియానా జోన్స్ తరహా క్యారెక్టర్‌లో మహేష్ బాబు కనిపిస్తాడని హింట్ ఇచ్చారు.
My next with @urstrulyMahesh is an adventure film on the lines of Indiana Jones. We just started writing a couple of months ago – @ssrajamouli#MaheshBabu #Rajamouli #SSMB pic.twitter.com/1tW1utdiBc
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) November 20, 2022