కరీంనగర్ సీపీ సహా పోలీసులకు పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇచ్చింది. జాగరణ దీక్ష సమయంలో తెలంగాణ బీజేపీ చీఫ్, ఎంపీ బండి సంజయ్ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌పై దాడి, అక్రమ అరెస్టు వ్యవహారంపై ప్రివిలేజ్ కమిటీకి బండి సంజయ్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి కరీంనగర్ సీపీ సత్యనారాయణకు పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26న కమిటీ ఎదుట హాజరుకావాలని పోలీసులకు నోటీసులు పంపించింది. కరీంనగర్ ఏసీపీ, హుజురాబాద్ ఏసీపీ, సీఐ, జమ్మికుంట సీఐ.. కరీంనగర్ వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది.
సీఎస్ సోమేష్‌కుమార్‌కు కూడా పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ కాపీ పంపించింది. ఇదిలా ఉంటే.. ఈ నెల 14 నుంచి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర రెండో విడత పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి సందర్భంగా జోగులాంబ గద్వాల్‌లో అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొని పాదయాత్రను ప్రారంభిస్తారు. అంతేకాకుండా ఈ సారి పాదయాత్రలో కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా పాల్గొననున్నట్లు తెలుస్తోంది.