కరీంనగర్ సీపీ సహా పోలీసులకు పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇచ్చింది. జాగరణ దీక్ష సమయంలో తెలంగాణ బీజేపీ చీఫ్, ఎంపీ బండి సంజయ్ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌పై దాడి, అక్రమ అరెస్టు వ్యవహారంపై ప్రివిలేజ్ కమిటీకి బండి సంజయ్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి కరీంనగర్ సీపీ సత్యనారాయణకు పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26న కమిటీ ఎదుట హాజరుకావాలని పోలీసులకు నోటీసులు…
కరీంనగర్ జిల్లా కమాన్ వద్ద జరిగిన కారు ప్రమాదంపై మంత్రి గంగుల కమలాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కలెక్టరేట్ కార్యాలయంలో మంత్రి గంగుల మీడియాతో మాట్లాడారు. ఇది చాలా బాధకరమైన ఘటన. ప్రమాద బాధిత కుటుంబాలను ఆదుకుంటాం. గత కొన్ని సంవత్సరాలుగా రోడ్లపై ఉండొద్దని చెబుతూ ఉన్నాం. సీసా కమ్ముల వారిని అక్కడ ఉండవద్దని చాలా సార్లు తీయించాం. కానీ కమాన్ దగ్గర ఉంటే ప్రమాదాలు జరుగుతాయని ముందే చెప్పాం వారు అక్కడే ఉంటున్నారు. స్పెషల్ టీం…
కరీంనగర్ కమాన్ కారు ప్రమాదం ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా కరీంనగర్ సీపీ సత్యనారాయణ మాట్లాడుతూ.. కరీంనగర్ కమాన్ సెంటర్ వద్ద జరిగిన యాక్సిడెంట్ మైనర్ల నిర్వాకమేనని ఆయన స్పష్టం చేశారు. కారు డ్రైవ్ చేసింది మైనర్ బాలుడు అతనితో పాటు మరో ఇద్దరు మైనర్లు ఉన్నారని కారు యజమాని కచ్చకాయల రాజేంద్రప్రసాద్ కొడుకే ప్రధాన నిందితుడని ఆయన వెల్లడించారు. మైనర్ తొమ్మిదోవ తరగతి చదువుతున్నాడని, మరో ఇద్దరు మైనర్లు పదవ తరగతి…
కరీంనగర్ బీజేపీ కార్యాలయంలో ఉపాధ్యాయ ఉద్యోగులకు మద్దతుగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ జాగరణ దీక్ష చేపట్టారు. దీంతో ఆయన చేపట్టిన దీక్షలో కోవిడ్ నిబంధనలు పాటించలేదని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ ఘటన తెలంగాణాలో హాట్ టాపిక్ గా మారింది. కరీంనగర్ లో బండి సంజయ్ అరెస్ట్, చోటు చేసుకున్న పరిణామాల పై బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ బీసీ కమిషన్ ను ఆశ్రయించింది. ఈ క్రమంలో కరీంనగర్ సీపీ సత్యనారాయణను గత…
పార్టీల మధ్య పోలీస్ అధికారులు నలిగిపోతున్నారా? బండి సంజయ్ ఎపిసోడ్ తర్వాత జరుగుతున్న చర్చ ఇదేనా? అక్కడ సీపీపై బీజేపీ గురిపెట్టిందా? కమలనాథుల హెచ్చరికలను ఎలా చూడాలి? ఈ అంశంలో టీఆర్‌ఎస్ పోలీస్ కమిషనర్‌ను ఎలా కాపాడుతుంది? సీపీ సత్యనారాయణపై బీజేపీ ఫిర్యాదులు..!కరీంనగర్ జిల్లాలో బీజేపీ రాష్ట్ర చీఫ్, ఎంపీ బండి సంజయ్ జాగరణ దీక్ష తలపెట్టడం.. అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడం.. సంజయ్ అరెస్ట్ చకచకా జరిగిపోయాయి. కోర్టు ఆదేశాలతో జైలు నుంచి బయటకొచ్చారు బండి…
సోషల్ మీడియా నెట్ వర్క్ ద్వారా దేశ ప్రముఖులు,ప్రజా ప్రతినిధులు, అధికారులు మీద కొందరు వ్యక్తులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని కరీంనగర్ సీపీ సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జీఎస్ ఛానల్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కొందరు విద్వేషాలనురెచ్చగొడుతున్నారని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎటువంటి అనుమతులు లేకుండా ఛానెల్ అని పెట్టి తమ లైన్ వక్రభాషను వాడుతున్నారని సీపీ అన్నారు. Read Also: బీజేపీ, ఆర్ఎస్‌ఎస్ రాజ్యాంగాన్ని కాలరాస్తున్నాయి:…
తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి కరీంనగర్‌లోని ఎమ్మెల్సీ ఎన్నికలు. రెండు స్థానాలకు పోలింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 72 గంటల ముందు సైలెంట్ పీరియడ్. ఈనెల 10వ తేదీన 8 గంటల నుండి 4 వరకూ పోలింగ్ నిర్వహిస్తారు. రెండు స్థానాలకు 8 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. కరీంనగర్ 2,జగిత్యాల 2 , పెద్దపల్లి 2, హుస్నాబాద్ 1, సిరిసిల్లలో ఒక పోలింగ్ కేంద్రం వుంది. ఈ ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం ఓటర్లు 1324. పురుషులు 581…
హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారం గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ మాట్లాడుతూ.. గత నెల 28న హుజురాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసిననాటి నుంచి నేటి వరకు కరీంనగర్ కమిషనరేట్, వరంగల్ కమిషనరేట్ సంబంధించి కమలాపూర్ మండల పరిధిలో ఎన్నికల దృష్ట్యా 10 చెక్ పోస్టులు, 10 ఫ్లయింగ్ స్క్వాడ్, 5 ఏంసీసీ, 10 వీఎస్‌టీ లను ఏర్పాటు చేసి, పకడ్బందీగా ఎన్నికల నియమావళిని అమలు చేస్తున్నామని తెలిపారు. తనిఖీల్లో…
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నా.. ఇంకా కొన్ని చోట్ల పెద్ద సంఖ్యలోనే కేసులు వెలుగుచూస్తున్నాయి… నిన్నటి బులెటిన్‌లో జీహెచ్‌ఎంసీలో కంటే.. కరీంనగర్‌లోనే అత్యధిక కేసులు నమోదు అయ్యాయి.. దీంతో.. జిల్లా యంత్రాంగం అప్రమత్తం అవుతోంది… జిల్లాలో కరోనా ఉధృతిపై మీడియాతో మాట్లాడిన కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్… కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతుండడంతో ప్రజల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.. అంతా తప్పనిసరిగా భౌతికదూరం పాటించాలని, మాస్క్ ధరించాలని స్పష్టం చేశారు.. ఎలాంటి ఆరోగ్య…