Komatireddy Venkat Reddy: తెలంగాణ ఉద్యమంలో గద్దర్ ఉన్నాడా.. బండి సంజయ్ ఉన్నాడా..?
- తెలంగాణ ఉద్యమంలో గద్దర్ ఉన్నారా.. బండి సంజయ్ ఉన్నారా?..
- కేంద్రమంత్రి హోదాలో ఉండి బండి సంజయ్ అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు..
- నేను మాట్లాడటం మొదలు పెడితే బీఆర్ఎస్ చాలా ఇబ్బందులు పడాలి: మంత్రి కోమటిరెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komatireddy Venkat Reddy: తెలంగాణ ఉద్యమంలో గద్దర్ ఉన్నారా.. బండి సంజయ్ ఉన్నాడా? అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. ఊరూరా తిరిగి పాట పాడి చైతన్యం చేసిన వ్యక్తి గద్దర్.. ఆయన చనిపోతే ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ కూడా నివాళి అర్పించారు అని గుర్తు చేశారు. కేంద్ర మంత్రిగా ఉన్న సంజయ్ ఈలాంటి కామెంట్స్ చేసి ఉండకుంటే బాగుండేది అన్నారు. ఇక, తాము మూసీ నదిని క్లీన్ చేస్తామంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు ఏసీ రూమ్స్ లో పడుకుంటున్నారు.. ఈ బీజేపీ వాళ్లు యూపీలో గంగా ప్రక్షాళన చేస్తామంటే సంతోష పడతారు.. కానీ, మూసీ ప్రక్షాళన చేస్తామంటే మాత్రం అడ్డు తగులుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు.
Also Read
- Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
- Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
- NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
- Telangana Tourism: పర్యాటకులకు తెలంగాణ టూరిజం బోర్డ్ గుడ్ న్యూస్..
ఇక, నల్గొండాకు కేటీఆర్ ఎందుకు వచ్చారు.. పదేళ్లు మా జిల్లాను విస్మరించారని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. మానవత్వం లేని మృగాలు వాళ్ళు.. SLBC ఎందుకు కంప్లీట్ చేయలేదు.. మల్లన్న సాగర్ నుంచి ఆలేరుకి ఎందుకు నీళ్ళు ఇవ్వలేదో సమాధానం చెప్పు అని ప్రశ్నించారు. అలాగే, మహాత్మా గాంధీ యూనివర్సిటీకి పదేళ్లలో ఎప్పుడైనా కేటీఆర్ వెళ్ళాడా అని అడిగారు. టీ- హబ్ కి తాళం వేసి ఉంచారు.. కంపెనీలు ఎందుకు తీసుకురాలేదు.. బార్లా లాగా టీ- హబ్ ను తయారు చేశారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ మీటింగులకు పల్లి బటాని బుక్కోవడానికి వచ్చినంత మంది కూడా కేటీఆర్ సభకు రాలేదన్నారు. ఫ్లోరోసిస్ కోసం నేను పోరాటం చేసినప్పుడు కేసీఆర్.. డిప్యూటీ స్పీకర్ గా ఉన్నాడనికోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
Read Also: Danush: 12 ఏళ్ల తర్వాత రిపీట్ కానున్న ఆ కాంబో
అయితే, కేటీఆర్, హరీష్ రావు నా కాలి గోటికి కూడా సరిపోరు అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. నువు మీ నాన్న పేరు చెప్పి.. హరీష్ మామ పేరు చెప్పి రాజకీయాల్లోకి వచ్చారు.. నేను కష్టపడి వచ్చిన మా నాన్న వ్యవసాయం చేశారని తెలిపారు. ఇక, కేటీఆర్ పేరు.. ఈ ఫార్ములా కేసులో ఉంది.. ధరణి భూములు, 2 లక్షల కోట్లు ఆస్తులు సంపాదించారు వాళ్ళు.. నాపై ఒక్క ఆరోపణ ఉందా?.. అని ప్రశ్నించారు. నువ్వు (కేటీఆర్), హరీష్ ఇద్దరు.. కేసీఆర్ ని వచ్చే అసెంబ్లీకి తీసుకుని రండి అని సవాల్ విసిరారు. ప్రతిపక్ష నాయకుడు పదవి నువ్వో..నీ బావ నో తీసుకోండి అని ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!