OTR: రాజాం మున్సిపాలిటీలో జనసేనకు సొంత పార్టీ సెగ.. టీడీపీ నేతల అలక
- రాజాంలో జనసేన అభ్యర్థిగా బనిశెట్టి సౌజన్యలత..
- కొత్తగా వచ్చిన నేత అంటూ పార్టీలో సహాయ నిరాకరణ..
- రాజాం మున్సిపాలిటీలో 40 శాతం కాపుల ఓట్లే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధిష్టానం బీ ఫామ్ ఇచ్చింది… కానీ, కేడర్ అండ్ లీడర్స్ వద్దంటున్నారు. పోనీ… మిత్రపక్షమన్నా పట్టించుకుంటుందా అంటే అదీ లేదు. వాళ్ళ అసంతృప్తులు వాళ్ళకు ఉన్నాయట. అడకత్తెరలో ఉన్నట్టు ఫీలవుతున్న ఆ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి ఎవరు? అంత దారుణైన పరిస్థితి ఎందుకు వచ్చింది?
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం మున్సిపాలిటీకి… ప్రత్యక్ష ఎన్నికలు జరిగి దశాబ్దాలు గడిచిపోయింది. రకరకాల కారణాలతో ఎలక్షన్స్ ఆగిపోయి, ప్రజా పాలన లేక అభివృద్ది పడకేసింది. 2005 నుంచి ఇక్కడి ఓటర్లకు మున్సిపల్ ఎన్నికలంటే తెలియదు. ఎట్టకేలకు ప్రస్తుతం సెకండ్ ఫేజ్‌లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఛైర్మన్ బీసీ మహిళకు రిజర్వ్ అయింది. కూటమి తరపున జనసేన అభ్యర్థి బనిశెట్టి సౌజన్యలత బరిలో ఉన్నారు. వైసీపీ తరపున పాలవలస పద్మావతి పోటీ పడుతున్నారు. అయితే… కూటమి పొత్తులో భాగంగా… సీటు తమ కోటాలోకి వచ్చిందని సంబరపడ్డ జనసేన నేతలకు ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదట.
Also Read
ఇన్నేళ్ళు పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా… పూర్తిగా కొత్త వారికి వ్యక్తికి టిక్కెట్ ఇచ్చారంటూ రచ్చ చేశారు జన సైనికులు. రాజాం ఏఎంసీ చైర్మన్ పదవి మెదలు, ఇటీవలి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీ ఫామ్స్ వరకు అన్ని విషయాల్లో టీడీపీ, జనసేన మధ్య నిభేదాలు బహిర్గతం అయ్యాయి. దాంతో..చాలా చోట్ల పార్టీ నాయకులే స్వతంత్రులుగా బరిలో దిగిన పరిస్థితి. ఆ రచ్చంతా మర్చిపోక ముందే…ఇప్పుడు మున్సిపల్ ఛైర్మన్ సీటును జనసేనలో కొత్త గా చేరిన నేతకు ఇవ్వడంపై భగ్గుమన్నాకు పార్టీ కార్యకర్తలు. సామాజిక లెక్కల ప్రకారం రాజాం మున్సిపాలిటీలో 40 శాతానికి పైగా ఓట్లు కాపులవే. జనసేనకి వెన్నుదన్నుగా ఉంటున్నది కూడా ఈ వర్గమే. అలాంటి బలమైన వర్గాన్ని నిరాశ పరిచి పార్టీ రిస్క్ తీసుకుందని అంటున్నారు గ్లాస్ లీడర్స్.
అభ్యర్థిత్వంపై ఇంటర్నల్‌గా ఆ పార్టీ వ్యవహారం అలా ఉంటే… ఇటు టీడీపీ కూడా హ్యాపీగా లేదట. మున్సిపల్ ఛైర్మన్ సీటు తమకే వస్తుందని ఆశపడ్డారు తెలుగుదేశం నాయకులు. కానీ… జనసేన కోటాకు వెళ్ళడం, అదీ కూడా కొత్తగా వచ్చిన వ్యక్తికి ఇవ్వడం అస్సలు మింగుడు పడలేదట. దీంతో… ఎవరికి వారు మాకు సంబంధం లేదన్నట్టు ఉండటంతో… రాజాంలో కూటమి గెలుపు సంగతేంటన్న ప్రశ్నలు వస్తున్నాయి. అయితే… అదే సమయంలో ఇక్కడ వైసీపీ పరిస్థితి కూడా అంత సవ్యంగా ఏమీ లేదంటున్నారు పరిశీలకులు.
విపక్షం కూడా వర్గ విభేదాలతో సతమతం అవుతోంది. ఈ మున్సిపాలిటీలో మొత్తం 32 వార్డులు ఉన్నాయి. ఐతే తాజాగా విలీనం అయిన సారధి, కొత్తవలస, కొండవలస, పోనిగిటి వలస గ్రామాల్లో వైసీపీకి మంచి పట్టుంది. దీంతో విభేదాలు వీడి కాస్త వర్కౌట్ చేసుకుంటే విపక్షానికి అవకాశాలు ఉండవచ్చన్నది ఒక అభిప్రాయం. అదే సమయంలో కూటమి లెక్కలు కాస్త తేడాగానే ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. కాగితం మీద గంభీరంగా కనిపిస్తున్నా.., కాపుల ఓట్లు అంతగా పడేలా సూచనలు లేవన్న అంచనాలున్నాయి.
దేవాంగుల సామాజికవర్గానికి కూటమి టిక్కెట్ కేటాయించడంతో మిగతా సామాజికవర్గాల నాయకులు రుసరుసలాడుతున్నారట. కూటమి పెద్దలు వెంటనే అంతర్గతంగా ఉన్న ఆ అసంతృప్తిని సెట్ చేయకుంటే ఫలితాలు రివర్స్ కొట్టినా ఆశ్చర్యం లేదన్న విశ్లేషణలు లోకల్‌గా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో… కూటమి అభ్యర్థికి ప్రచారం కంటే… మిత్రపక్షాలను కలుపుకుని వెళ్ళడమే అసలైన టాస్క్ అని అంటున్నారు. అసలే అలక మీదున్న సొంత పార్టీ జనసేన నేతలకు, అసంతృప్తితో ఉన్న టీడీపీ నాయకులకు మధ్య అడకత్తెరలో ఉన్నట్టు ఫీలవుతున్నారట. రాజాం గ్లాస్ అభ్యర్థి బనిశెట్టి సౌజన్యలత. ప్రచారానికి తక్కువ సమయం ఉండటం, రాజకీయాలకు పూర్తిగా కొత్త కావడంతో జనసేన అభ్యర్థి కూటమి వేవ్‌నే నమ్ముకున్నారట.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-8 Live: నేడు మరో విశేష ఘట్టం.. నరసింహస్వామి మహాభిషేకం.. తులసీ దామోదర కల్యాణం
-
OTR: రాజాం మున్సిపాలిటీలో జనసేనకు సొంత పార్టీ సెగ.. టీడీపీ నేతల అలక
-
OTR: వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనన్న సుదర్శన్ రెడ్డి.. వైరాగ్యమా? అసంతృప్తా?
-
OTR: కాకినాడపై కూటమి స్పెషల్ ఫోకస్.. కులాల వారీగా మంత్రుల ప్రచారం!
-
OTR: రేఖా నాయక్ రైస్ మిల్ పై ఈడీ దాడులు.. సొంత పార్టీ నేతలే కుట్ర చేశారా?
-
Rishabh Pant: రిషబ్ పంత్ వరల్డ్ రికార్డు.. చరిత్రలోనే తొలి వికెట్ కీపర్‌గా..
ట్రెండింగ్
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్‌తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!