Asaduddin Owaisi : ఒవైసీకి పోలీసుల గౌరవ వందనం.. అసలు ట్విస్ట్ ఇదే.!
- సహారన్పూర్లో ఆసక్తికర ఘటన
- జడ్జికి బదులు ఒవైసీకి గౌరవ వందనం
- పోలీసుల పొరపాటుపై విచారణకు ఆదేశం
- యూపీలో కొత్త కూటమి తర్వాత ఒవైసీ పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లోని సహారన్పూర్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి పోలీసులు పొరపాటున గౌరవ వందనం సమర్పించడం చర్చనీయాంశంగా మారింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కోసం ఏర్పాటు చేసిన గౌరవ వందనం అనుకోకుండా ఒవైసీకి దక్కింది. పోలీసులు సెల్యూట్ చేయడంతో ఒవైసీ కూడా నిలబడి గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.
న్యాయమూర్తికి బదులు ఒవైసీకి సెల్యూట్
సహారన్‌పూర్‌లోని సర్క్యూట్ హౌస్‌కు సుప్రీంకోర్టు న్యాయమూర్తి రావాల్సి ఉంది. ఆయన రాక సందర్భంగా పోలీసులు గౌరవ వందనం సమర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే న్యాయమూర్తి కంటే ముందుగానే ఒవైసీ అక్కడికి చేరుకున్నారు. దీంతో ఆయననే న్యాయమూర్తిగా భావించిన పోలీసులు గౌరవ వందనం సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా చర్చకు దారితీసింది.
Also Read
- OTR: రేఖా నాయక్ రైస్ మిల్ పై ఈడీ దాడులు.. సొంత పార్టీ నేతలే కుట్ర చేశారా?
- CM Revanth Reddy :తెలంగాణ ఎగుమతుల్లో 68% వృద్ధి.. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీయే లక్ష్యం
- Human Skull Found : మొన్న మహిళ కాలు.. నేడు మనిషి పుర్రె.. ఇబ్రహీంపట్నంలో మిస్టరీ
- HSRP Number Plate : తెలంగాణ వాహనదారులకు అలర్ట్.. నంబర్ ప్లేట్లపై స్పెషల్ డ్రైవ్..
యూపీలో కొత్త రాజకీయ కూటమి
ఉత్తరప్రదేశ్‌లో కొత్త రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఒవైసీ సహారన్పూర్ పర్యటనకు వచ్చారు. ఏఐఎంఐఎం, చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలోని ఆజాద్ సమాజ్ పార్టీ కలిసి ‘సోషల్ చేంజ్ ఫ్రంట్’ పేరుతో కూటమిని ఏర్పాటు చేసినట్లు ప్రకటించాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రశేఖర్ ఆజాద్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించాయి. ఈ పొత్తు ప్రకటన తర్వాత ఒవైసీ తొలిసారిగా సహారన్పూర్కు వచ్చారు.
నవంబర్ 26న లక్నోలో భారీ ర్యాలీ
కొత్త కూటమి తరఫున నవంబర్ 26న లక్నోలో ర్యాలీ నిర్వహించేందుకు నేతలు సిద్ధమవుతున్నారు. ఈ సభలో ఒవైసీ, చంద్రశేఖర్ ఆజాద్ ఒకే వేదికపై కనిపించనున్నారు. రాష్ట్రంలోని 403 అసెంబ్లీ స్థానాల్లో తమ రాజకీయ ప్రభావాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా ఇరు పార్టీలు కార్యాచరణ రూపొందిస్తున్నాయి. ముఖ్యంగా దళితులు, ముస్లింల జనాభా గణనీయంగా ఉన్న పశ్చిమ ఉత్తరప్రదేశ్‌పై దృష్టి సారించాయి.
ఎస్పీ, కాంగ్రెస్‌లకు ఒవైసీ ఆహ్వానం
కొత్త కూటమిలో చేరాలని సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌లను కూడా ఒవైసీ ఆహ్వానించారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతుల సమస్యలను ప్రధాన రాజకీయ అంశాలుగా ప్రస్తావించారు. వెనుకబడిన వర్గాలకు సరైన ప్రాతినిధ్యం కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సహారన్పూర్ పర్యటనలో చోటుచేసుకున్న గౌరవ వందనం ఘటన రాజకీయ చర్చల్లో ప్రత్యేకంగా నిలిచింది. ఈ ఘటనపై ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందని సహారన్పూర్ సిటీ ఎస్పీ వ్యోమ్ బిందాల్ అంగీకరించారు. గౌరవ వందనం పొరపాటున ఒవైసీకి సమర్పించారని, దీనిపై విచారణకు ఆదేశించామని తెలిపారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-8 Live: నేడు మరో విశేష ఘట్టం.. నరసింహస్వామి మహాభిషేకం.. తులసీ దామోదర కల్యాణం
-
Asaduddin Owaisi : ఒవైసీకి పోలీసుల గౌరవ వందనం.. అసలు ట్విస్ట్ ఇదే.!
-
OTR: రాజాం మున్సిపాలిటీలో జనసేనకు సొంత పార్టీ సెగ.. టీడీపీ నేతల అలక
-
OTR: వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనన్న సుదర్శన్ రెడ్డి.. వైరాగ్యమా? అసంతృప్తా?
-
OTR: కాకినాడపై కూటమి స్పెషల్ ఫోకస్.. కులాల వారీగా మంత్రుల ప్రచారం!
-
OTR: రేఖా నాయక్ రైస్ మిల్ పై ఈడీ దాడులు.. సొంత పార్టీ నేతలే కుట్ర చేశారా?
ట్రెండింగ్
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్‌తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!