Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rayudu: భారత క్రికెట్లో ప్రాంతీయ వివక్ష, ముఖ్యంగా హైదరాబాద్ ఆటగాళ్లకు ఎదురవుతున్న అన్యాయంపై మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మరోసారి ఘాటుగా స్పందించారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆయన.. యువ సంచలనం తిలక్ వర్మ ప్రదర్శనను ప్రశంసిస్తూనే, మరోవైపు ముంబై ఆటగాళ్లకు లభించే ప్రాధాన్యతపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
తిలక్ వర్మ కేవలం ఒక్క ఫార్మాట్‌కు మాత్రమే పరిమితమయ్యే ఆటగాడు కాదని.. టెస్టులు, వన్డేలు, టీ20లు ఇలా మూడు ఫార్మాట్లలోనూ ఆడగల పూర్తి సామర్థ్యం అతనిలో ఉందని అంబటి రాయుడు పేర్కొన్నారు. రెడ్ బాల్, వైట్ బాల్ అనే తేడా లేకుండా ఎక్కడ ఆడినా తిలక్ పరుగుల వరద పారిస్తూ జట్టుకు ఒంటిచేత్తో విజయాలు అందిస్తున్నాడని కొనియాడారు. అతనికి మూడు ఫార్మాట్లలోనూ అవకాశాలు రావాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.
Also Read
- Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!
- Chittoor Municipal Corporation: చిత్తూరు కార్పొరేషన్లో ట్విస్ట్.. ప్రమాణ స్వీకారానికి ముందే వైసీపీ కార్పొరేటర్ రాజీనామా
- Kaviya Maran: తన ఉద్యోగులకు ఆరెంజ్ ఆర్మీ క్వీన్ సర్ప్రైజ్ గిఫ్ట్.. పెళ్లి కానుక బాక్స్ వీడియోలు వైరల్..
- Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!
తిలక్ వర్మకు అవకాశాలు కల్పించాలని తాను ఏదో అనవసరంగా సిఫార్సు చేయడం లేదని రాయుడు అన్నారు. “ఇప్పుడు తిలక్ వర్మ చేస్తున్న ఇదే తరహా ప్రదర్శనను ఎవరైనా ముంబై ఆటగాడు చేసి ఉంటే, అతడిని కేవలం ఒక్క ఫార్మాట్‌కే పరిమితం చేసేవారా? అందరి నెత్తిలు తొక్కించి మరీ అతడిని అందరికంటే పైన కూర్చోబెట్టేవారు” అంటూ రాయుడు ఘాటుగా విమర్శించారు. ఇక మన హైదరాబాద్ ఆటగాళ్ల విషయానికి వచ్చేసరికి ఎప్పుడూ ఒక పరిమితి విధిస్తారని రాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వీవీఎస్ లక్ష్మణ్‌ను కేవలం ఒక్క ఫార్మాట్‌కే పరిమితం చేశారని, తాము కూడా ఒక్కో ఫార్మాట్ ఆడటమే ఎక్కువైపోయిందని గుర్తు చేశారు. ఇప్పుడు తిలక్ వర్మను కూడా అలాగే ఒక్క ఫార్మాట్‌కు పరిమితం చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రస్తుత సెలెక్షన్ కమిటీలో మన హైదరాబాద్ నుంచి ఆడిన ప్రజ్ఞాన్ ఓజా ఉండటాన్ని రాయుడు ప్రస్తావించారు. “ఓజాకి మనమందరం ఉత్తరాలు రాసి విజ్ఞప్తి చేద్దాం అని.. ఓజా గారు, దయచేసి మా వాడిని (తిలక్ వర్మను) కాస్త అన్ని ఫార్మాట్లలో ఆడిపించండి, అతను బాగుపడతాడు. మీరు పదవిలో ఉన్నప్పుడే ఈ పని చేయాలి, లేకపోతే ఇండియన్ క్రికెట్ రాజకీయాల గురించి తెలిసిందే కదా, తర్వాత కష్టమవుతుంది’ అంటూ రాయుడు తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
Parliament Session December 2026: డిసెంబర్ 10 నుంచి పార్లమెంట్ సమావేశాలు..!?.. కీలక బిల్లుపై ఉత్కంఠ
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Rohingya Genocide: రోహింగ్యాలను కావాలనే చంపారు..తేల్చేసిన అంతర్జాతీయ న్యాయస్థానం!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!
-
Chittoor Municipal Corporation: చిత్తూరు కార్పొరేషన్లో ట్విస్ట్.. ప్రమాణ స్వీకారానికి ముందే వైసీపీ కార్పొరేటర్ రాజీనామా
ట్రెండింగ్
-
Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!
-
Viral Video: ఛీ.. ఛీ.. వ్యూస్ కోసం ఇంతకు దిగజారాలా..? బస్సులో ప్రయాణికుడితో యువతి వికృత చేష్టలు..!
-
అబ్బా ఏముంది మామ కారు.. 1,100 కి.మీ. రేంజ్, లెవల్-2 ADAS తో రానున్న JSW Combat..!
-
IND vs NZ: ముగిసిన మూడోరోజు ఆట.. 118 పరుగుల ఆధిక్యంలో భారత్.!
-
Royal Enfield బైక్ లవర్స్‌కు క్రేజీ న్యూస్.. 10 ఏళ్ల వారంటీ.. ఎక్స్ట్రా ఖర్చు లేకుండానే..!