తెలంగాణ ఉద్యమంలో ప్రజల గుండెల్లో నిలిచిన కవులు కళాకారులు సాహితీవేత్తలు తొమ్మిది మందికి కోటి రూపాయల నగదు పురస్కారం అందిస్తామని తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా గద్దర్ సతీమణి విమలకు కోటి రూపాయల నగదు పారితోషికం అందజేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తొమ్మిది మందికి కోటి రూపాయల నగదు పురస్కారం అందించారు. Also Read:Shreyas Iyer: ఐపీఎల్‌లో శ్రేయస్ అయ్యర్ చరిత్ర.. ధోనీ,…
Bandi Sanjay Kumar: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ప్రభుత్వంపై విరుచుక పడ్డారు. తెలంగాణలో ఇటీవల జరిగిన ఓ నిర్ణయం రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. గద్దర్‌కు పద్మ అవార్డు ఇవ్వలేదనే కారణంతో ఒక వీధి పేరును మార్చడం ఓ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రతీకారాత్మక చర్యగా ప్రవర్తించడం చూస్తుంటే నవ్వేలా ఉంది. ఇది పిల్లల ఆటనా? ప్రజాస్వామ్యంలో నాయకత్వ బాధ్యతలు చేపట్టిన ఓ వ్యక్తి ఈ స్థాయిలో వ్యవహరించడం తగినదేనా?…
కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై సీపీఐ రామకృష్ణ ఫైర్ అయ్యారు.. గద్దర్ పై బండి సంజయ్ వ్యాఖ్యలను ప్రజా తంత్ర వాదులు తీవ్రంగా ఖండించాలన్నారు.. బుధవారం ఆయన మాట్లాడుతూ.. "గద్దర్ ఏనాడూ అవార్డుల కోసం, పదవుల కోసం ఎదురు చూడలేదు.. ప్రజల పక్షాన పోరాటం చేసిన గొప్ప కళాకారుడు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కాదు ఆయన తొండి సంజయ్..
Komatireddy Venkat Reddy: తెలంగాణ ఉద్యమంలో గద్దర్ ఉన్నారా.. బండి సంజయ్ ఉన్నాడా? అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. ఊరూరా తిరిగి పాట పాడి చైతన్యం చేసిన వ్యక్తి గద్దర్.. ఆయన చనిపోతే ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ కూడా నివాళి అర్పించారు అని గుర్తు చేశారు.
గద్దర్‌పై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.. ఎల్‌టీటీ ప్రభాకరన్, నయీమ్‌తో గద్దర్‌ను పోల్చారు విష్ణువర్ధన్ రెడ్డి.. గద్దర్ కి పద్మ పురస్కారం ఇవ్వాలని ప్రధానికి సీఎం లేఖరాయడంపై స్పందించిన విష్ణువర్ధన్ రెడ్డి.. భారత రాజ్యాంగాన్ని విశ్వసించని వ్యక్తి గద్దర్ కి పద్మ పురస్కారం ఎలా ఇస్తారు? అని నిలదీశారు.
విశాఖ ఉక్కు తెలుగు వారి హక్కు నినాదం తో దర్శక, నిర్మాత, హీరో, జనం స్టార్ సత్యారెడ్డి నిర్మాణం లో ప్రజా యుద్ధనౌక, విప్లవ కవి గద్దర్ నటించిన ఆఖరి చిత్రం,”ఉక్కు సత్యాగ్రహం”. ఈ సినిమాని ఈ నెల 29న బ్రహ్మాండంగా విడుదల చేస్తున్నారు. గద్దరన్న మూడు పాటలు పాడి రెండు పాటల్లో మరియు కొన్ని సందేశాత్మక సీన్స్ లో నటించారు. గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ అద్భుతమైన సాహిత్యం అందించారు. మాజీ సీబీఐ డైరెక్టర్…
విశాఖ స్టీల్ ప్లాంట్ నేపథ్యంలో తెరకెక్కిన ‘ఉక్కు సత్యాగ్రహం’ ఆడియోను గద్దర్ చేతులమీదుగా విడుదల చేశారు. ‘ప్రత్యూష, సర్దార్ చిన్నపరెడ్డి, రంగుల కళ, కుర్రకారు, అయ్యప్ప దీక్ష, గ్లామర్, సిద్ధం, ప్రశ్నిస్తా’ వంటి చిత్రాలను నిర్మించిన సత్యారెడ్డి ఈ సినిమాను రూపొందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని ప్రధాన అంశంతో తాజాగా ‘ఉక్కు సత్యాగ్రహం’ పేరుతో సత్యారెడ్డి తీస్తున్న సినిమా ఇది. ప్రధాన పాత్ర పోషిస్తూ, స్వీయ నిర్మాణ దర్శకత్వంలో జనం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ…
విశాఖ ఉక్కు తెలుగు వారి హక్కు నినాదం తో దర్శక, నిర్మాత హీరో జనం స్టార్ సత్యారెడ్డి నిర్మాణం లో ప్రజా యుద్ధనౌక, విప్లవ కవి గద్దర్ నటించిన ఆఖరి చిత్రం,”ఉక్కు సత్యాగ్రహం ” ఈ చిత్రాన్ని ఈ నెల 30 న విడుదల చేస్తున్నారు. జాతీయ ఉత్తమ ప్రముఖ దర్శకులు నిర్మాత బి.నర్సింగరావు. తెలంగాణా రాష్ట్ర గీతం రూపశిల్పి అందేశ్రీ, గద్దర్ తనయుడు సూర్యం, జానపద కవి గోరేటి వెంకన్న, ప్రొఫెసర్ కోదండరాం, నందిని సిద్ధారెడ్డి,…
ప్రజా యుద్ధనౌక గద్దర్ వర్ధంతి సందర్భంగా.. ఆయనతో తనకు ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. నేడు ప్రజా గాయకులు గద్దర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ఆయన.. గద్దర్ పోరాట స్ఫూర్తిని మరచిపోలేం అన్నారు.. పీడిత వర్గాల గొంతుకగా గద్దర్ నిలిచారు. తన పాటనే అస్త్రంగా చేసుకొని గద్దర్ ప్రజా పోరాటాల్లో ఒక అధ్యాయాన్ని లిఖించారు. నక్సల్ పోరాటం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు గద్దర్ తన గానంతో…