తీన్మార్ మల్లన్న విషయంలో తనకు మాట్లాడేంత టైమ్ లేదని.. మాట్లాడం వేస్ట్ అని అన్నారు. తీన్మార్ మల్లన్నకు టీపీసీసీ, ఏఐసీసీ, క్రమశిక్షణ చైర్మన్ చిన్నారెడ్డి నోటీసులు ఇచ్చినట్లు పేపర్‌లో చూశానని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వేలో 56.6 శాతం బీసీలు ఉన్నట్లుగా తేల్చామని తెలిపారు.
Komatireddy Venkat Reddy: తెలంగాణ ఉద్యమంలో గద్దర్ ఉన్నారా.. బండి సంజయ్ ఉన్నాడా? అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. ఊరూరా తిరిగి పాట పాడి చైతన్యం చేసిన వ్యక్తి గద్దర్.. ఆయన చనిపోతే ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ కూడా నివాళి అర్పించారు అని గుర్తు చేశారు.
Komati Reddy: నాకు పేరు వస్తుందనే ప్రాజెక్టుకు మాజీ సీఎం కేసీఆర్ నిధులు విడుదల చేయలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. రేపు నల్లగొండ జిల్లా బ్రాహ్మణ వెల్లంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా..
కేసీఆర్ 10 ఏళ్లలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా పేదలకు ఇవ్వలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. వచ్చే నెలలో ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభిస్తామన్నారు. 7 లక్షల కోట్లు అప్పు చేసి కాళేశ్వరం కడతా అని చెప్పి కూలిపోయే కాళేశ్వరం కట్టారని తీవ్రంగా విమర్శలు గుప్పించారు.
నల్లగొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటించారు. మహాత్మ జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేశారు. త్వరలో రైతు భరోసా ఇవ్వబోతున్నామని తెలిపారు. ఇప్పటికే 18 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశాం.. మిగతా రుణమాఫీ ఈ నెల 30న చేస్తామన్నారు.
ఆర్ & బీ రివ్యూలో అధికారుల పని తీరుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిద్ర మత్తు వీడి రోడ్ల రిపేర్లు చేయాలని ఆదేశించారు. వర్షాలకు రోడ్లు దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రిపేర్లు చేయకుండా మీనమేషాలు లెక్కించడం ఏంటి? అని ప్రశ్నించారు.
తాము ఏ కార్యక్రమం చేసినా పని పెట్టుకుని బురద జల్లుతున్నారని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనుకబడిన కులాలు అంటే కేసీఆర్, హరీష్, కేటీఆర్‌లకు చిన్న చూపు అంటూ మండిపడ్డారు. బలహీన వర్గాలకు చెందిన మహేష్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడు అయ్యారని, దళితుడు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అయ్యారని తెలిపారు.
రాష్ట్రంలో రుణమాఫీ కాని రైతులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు. వారంలోపు మిగిలిన వారందరికీ రైతు రుణమాఫీ పూర్తి అవుతుందని వెల్లడించారు. నల్గొండ జిల్లా నల్గొండ మండలం అర్జాలబావి వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు.
Komatireddy: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం బోనాలతో సందడి నెలకొంది. లాల్‌దర్వాజ బోనాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. పాతబస్తీలోనూ పండుగలు కొనసాగుతున్నాయి.