Nagole Flyover: నాగోల్ ఫ్లైఓవర్‌ను రాష్ట్ర పురపాలక, పరిపాలనా శాఖ పట్టణాభివృద్ధి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. నాగోల్ ఫ్లైఓవర్‌కు యుటిలిటీ షిఫ్టింగ్, ల్యాండ్ అక్విజిషన్, ప్రాజెక్ట్‌తో కలిపి మొత్తం రూ.143.58 కోట్లు ఖర్చు చేశారని కేటీఆర్ తెలిపారు. ఇది 990 మీటర్ల పొడవుతో 6 ద్వి దిశలతో నిర్మించబడిందని మంత్రి పేర్కొన్నారు. ఈ ఫ్లైఓవర్‌తో ఉప్పల్ నుంచి ఎల్‌బీనగర్ వరకు సిగ్నల్ ఫ్రీ రవాణా సౌకర్యం ఉంటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
Read also: B Vinod Kumar: మునుగోడులో టీఆర్‌ఎస్ గెలవడం ఖాయం
హైదరాబాద్‌లో మెరుగైన రవాణా సదుపాయమే లక్ష్యంగా ఫ్లైఓవర్లను నిర్మిస్తున్న జీహెచ్‌ఎంసీ ఎస్‌ఆర్‌డీపీ కింద మొత్తం 47 పనులను చేపట్టిందని తెలిపారు. ఇప్పటి వరకు 31 ప్రాజెక్టులు పూర్తయ్యాయని, మరో 16 పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. పూర్తయిన 31 పనుల్లో 15 ఫ్లై ఓవర్లు అందుబాటులోకి వచ్చాయని కేటీఆర్ తెలిపారు. నాగోల్ ఫ్లైఓవర్ వరుసగా 16వది అని.. చాలా మంది ప్రజలు నగరంలోకి రావడానికి ఇదే ప్రధాన మార్గమని, ఫ్లై ఓవర్ల పరంపర ఇక్కడితో ఆగలేదని మంత్రి చెప్పారు. మాదాపూర్, గచ్చిబౌలిలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి త్వరలో మరో రెండు ఫ్లై ఓవర్లు రానున్నాయని తెలిపారు. ఒకటి కొత్తగూడ ఫ్లైఓవర్ కాగా మరొకటి శిల్పా లేఅవుట్ బ్రిడ్జి. ఈ రెండింటి పనులు పూర్తవుతున్నాయి. వీటిని కూడా డిసెంబర్‌లో ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నేడు…నాగోల్ ఫ్లైఓవర్ అందుబాటులోకి రానున్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
Bulldozer Threat: రోగికి ప్లాస్మాకు బదులు బత్తాయి జ్యూస్ ఘటన.. రంగంలోకి బుల్డోజర్..