B.Vinod Kumar: మునుగోడులో టీఆర్‌ఎస్ గెలవడం ఖాయమని కరీంనగర్ జిల్లా మాజీ ఎంపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఉచితాలపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై జనం నిరసనతో ఉన్నారని తెలిపారు. ట్యాక్సీ కట్టే సంపన్న వర్గాలకు మద్దతుగా మోడీ మాట్లాడటాన్ని ఖండిస్తున్నామని అన్నారు. పుట్టిన ప్రతి పౌరుడు ఇన్ డైరెక్ట్ గా ట్యాక్సీ కడుతున్నాడు దాని గురుంచి మోడీ పట్టించుకోరని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం వ్యవసాయానికి ఖర్చు పెట్టొద్దని బిల్లు తీసుకు వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Rakul Preet Son Gay : కొడుకు ‘గే’ అని తెలిస్తే చెంపపగుల కొడతానన్న రకుల్ ప్రీత్
రాజగోపాల్ రెడ్డిని ఎందుకు రాజీనామా చేపించారని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ ఉప ఎన్నికల కుట్రకు తెరలేపిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ తో గెలిచినా మూడేళ్ళ నుండి బీజేపితో టచ్ లో ఉన్నానని రాజగోపాల్ రెడ్డి చెప్పాడరి వినోద్ కుమార్ తెలిపారు. తెలంగాణలో బీజేపీ పార్టీ కుట్రలను ప్రజలు గ్రహించారని, బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో ఉన్న గవర్నర్ లు పవర్తన బాలేదని మండిపడ్డారు. గవర్నర్ తమిళ్ సై శాసన మండలి బిల్లులు ఎందుకు ఆమోదం తెలపలేదో ఆమె చెప్పాలని పేర్కొన్నారు. తెలంగాణ యూనివర్సిటీలలో 2 వేల ఖాళీ ఉద్యోగాల నియామకం బిల్లు ఉందని అన్నారు. సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపిన బిల్లును గవర్నర్ వెంటనే ఆమోదం తెలపాలని కోరుతున్నామని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.
Grace Children Home Incharge: అకౌంటెంట్ అత్యాచారంపై మాకు చెప్పలేదు.. ఇప్పుడు ఎందుకు