డాక్టర్ కేఏ పాల్ ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో పలుబడి ఉన్న నేత.. తాను శాంతి చర్చలు జరిపి.. యుద్ధాలనే ఆపిన వ్యక్తిని అని ఆయనే స్వయంగా పలు సందర్భాల్లో వెల్లడించారు.. అంతేకాదు.. చాలా దేశాధినేతలు తన ఆశిస్తులు తీసుకున్నవారే అని చెబుతుంటారు.. కానీ, ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత అసలైన ఆట మొదలైంది.. మత ప్రచారకుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉండొచ్చు.. కోట్లాది మంది ఆయన ఉపన్యాసాలకు ముగ్ధులు కావొచ్చు.. కానీ, రాజకీయ కురుక్షేత్రంలో సీన్ రివర్స్‌గా ఉంది. ప్రచారంలో రాయన దూకుడు చూపించినా.. చూసేవారికి అది కామెడీ షో లాగే కనిపిస్తుందా? ఆయన ఏం చేసినా? అంతా జోక్‌గానే తీసుకుంటున్నారా? అనే అనుమానాలకు తావిస్తుంది.. సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో హల్‌చల్ చేసి.. కనీసం చెప్పుకునే స్థాయిలో కూడా ఓట్లు రాబట్టుకోలేకపోయిన ఆయన.. తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచిన మునుగోడు ఉప ఎన్నికలో బరిలోకి దిగి కొత్త చర్చకు తెరలేపారు.. ప్రజాయుద్ధనౌక గద్దర్‌ను మొదట పోటీకి పెట్టాలని భావించినా.. సాంకేతిక కారణాలు అడ్డుగా నిలవడంతో.. ఆయనే సీన్‌లోకి వచ్చారు.. ఆది నుంచి ప్రచారంలో దూకుడు చూపించారు.. తానే గెలవబోతున్నానని… 50 వేలకు పైగా మెజార్టీతో విజయం సాధిస్తున్నాను.. అసలు రెండో ప్లేస్ ఎవరిది? అని ఆయన ఆరా తీయడం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Read Also: Twitter : ట్విటర్ తీసేసింది.. ఇప్పుడు మెటా మొదలు పెట్టింది
అంతేకాదు.. , నాకు టైం లేదు .. నాకే ఓటేయండి అంటూ ఆయన పరుగులు పెట్టిన వీడియో.. ప్రసంగాలు, విన్యాసాలు, డ్యాన్స్‌లు, ఎలక్షన్ సిబ్బందిపై, పోలీసులపై తన దైన శైలిలో ఆయన విరుచుకుపడడం.. తెలంగాణకు కాబోయే సీఎంను నేను.. నన్నే ఆపుతారా? అంటూ మండిపడడం.. ఇలా మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో రచ్చ చేశాయి.. అంతేకాదండోయే.. పాల్ ఇంటర్వ్యూ వచ్చినా.. యూ ట్యూబ్‌లో ప్రత్యేకంగా లైవ్‌లు పెట్టినా.. జనం తెగ చూశారట.. ఇక, సోషల్ మీడియాలో మునుగోడులో గెలవబోయేది ఎవరు? అంటూ కొన్ని ఆన్‌లైన్‌లో నిర్వహించిన కొన్ని సర్వేలోనూ పాల్‌కే ఓట్లు వేశారట.. అంతెందుకు.. పోలింగ్ ముగిసిన తర్వాత పాల్‌కు వచ్చే మెజార్టీ ఎంత? అనే మరో సర్వేకు చాలా మంది లక్ష ఆప్షన్‌ను క్లిక్ చేశారట.. ఇదంతా బాగానే ఉంది.. ప్రచారం గట్టిగానే చేశారు.. కానీ, ఓట్ల విషయానికి వస్తే.. ఊహకు కూడా అందడం లేదు.. ఎందుకంటే.. మొత్తం ఓట్లకు పాల్‌కు వచ్చింది కేవలం 805 ఓట్లు మాత్రమే.. మునుగోడులో నోటాకు 482 ఓట్లు వచ్చాయి.. దాని కంటే.. కొంచెం బెటరే కానీ.. మూడంకెలకే పరిమితం అయ్యారు..
Read Also: CJI U U Lalit: ఒక రోజు ముందుగానే సీజేఐ లలిత్‌కు వీడ్కోలు.. ఎందుకంటే..?
ఆది నుంచి అధికార పక్షంతో పాటు.. విపక్ష పార్టీ అభ్యర్థులను కౌంటర్ చేస్తూ వచ్చిన కేఏ పాల్.. మునుగోడులో గెలిచేది నేనే.. ఆరు నెలల్లో మునుగోడును అమెరికా చేసేస్తా.. తెలంగాణకు కాబోయే సీఎంను నేనే.. అంతెందుకు పోలింగ్ ముగిసిన తర్వాత.. ఎగ్జిట్ పోల్స్ తూచ్.. 50 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో నేను గెలవబోతున్నాను అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. కానీ, ప్రజలకు అవన్నీ పట్టవుగా.. ఆయన నిలబడి ప్రచారం చేసినా.. వివిధ రూపాల్లో.. ఘాటైన విమర్శలు చేసినా.. దాడులకు లోనైనా.. తెలివిగా చమత్కార బాణాలు వేసినా.. ఎన్నికల కురుక్షేత్రంలో ఘోర ఓటమిని మూడగట్టుకున్నారు.. సామాన్యుడు కూడా దైర్యంగా ఎన్నికలలో ప్రజాస్వామ్యంలో నిలబడ వచ్చు అనేకి అతను ఐకానిక్ సింబల్ కావొచ్చు.. ధనం లేనిది ఓట్లు రావు అనే దానికి సింబల్ అనే చెప్పాలి.. ఊరికే ప్రజలను ఆకట్టు కొంటే ఓట్లు రావు అనేది కూడా నిరూపించారు.. జనాల దృష్టిలో ఉన్నంత మాత్రాన, నాలుగు మాటలు చెప్పినంత మాత్రాన, నవ్విచ్చినంత మాత్రాన, తిరిగినంత మాత్రాన.. ఓట్లు తెచ్చుకోలేం.. కొంత ఫాలోయింగు, ప్రజాకర్షణ ఉన్నంత మాత్రాన ప్రజాక్షేత్రంలో గెలవలేం అనే మెసేజ్ కూడా ఇచ్చారు. ఎన్నికల్లో నిలవాలంటే.. నిలిచి గెలవాలంటే.. అది మాత్రమే సరిపోదు.. మద్యం ఏరుల్లా పారించాలి, నోట్ల కట్టలు వెదజల్లాలి, మంది మార్బలం ఉండాలి.. దమ్ము ధైర్యం ఉండాలి.. మంచి వ్యూహం ఉండాలి.. వ్యూహకర్తలు, స్పాన్సర్లు.. గాడ్ ఫాదర్‌లు.. ఇలా.. ఎన్నో ఉంటే తప్ప ఎన్నికల్లో గెలవలేం అనేది కూడా అర్థమయ్యేలా చెబుతోంది.. ఇక, మునుగోడు ప్రజలు.. బంగారం ఇస్తామన్నారు ఇవ్వలేదు..? పది వేలు అన్నారు మూడు వేలే ఇచ్చారు..? ఓటు ఎలా వేయాలి..? అని ప్రశ్నించడం కూడా.. పార్టీలు ప్రజలు ఏ వైపునకు నడిపిస్తున్నాయి..! ప్రజలను ఎలా మార్చేస్తున్నాయి..! అనేది కూడా అర్థం చేసుకోవచ్చు.