మోడీ వైపే దేశ ప్రజలు , మరోసారి మూడు రాష్ట్రాల ఫలితాలు నిరూపించాయన్నారు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలు ఏవైనా దేశ ప్రజానీకం మోడీ వెన్నంటే అన్నారు. 70 యేండ్లు నిర్లక్ష్యానికి గురయిన ఈశాన్య రాష్ట్రాల తొలిసారి అభివృద్ధి రుచి చూస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. డబల్ ఇంజిన్ సర్కార్ కోసమే బీజేపీకి విజయాలు వస్తున్నాయన్నారు. మూడు రాష్ట్రాల ఫలితాలు దేశ వ్యాప్తంగా మోడీ సర్కారుకు ప్రజలు బ్రహ్మరథమ్ పట్టరాని ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. ఇది అసంబద్ధ పొత్తులు పెట్టుకున్న కాంగ్రెస్ , కమ్యూనిస్టు పార్టీలకు చెంపపెట్టు అని అన్నారు. మణిపూర్ పర్యటనలో ఉన్న ఆయన ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇన్నేండ్లు నిర్లక్ష్యానికి గురయిన ఈశాన్య రాష్ట్రాలు మోడీ సర్కారు వచ్చిన తర్వాత అభివృద్ధిని చూసి అక్కడి ప్రజలు బీజేపీ కి ఓటేస్తున్నారని అందుకే మోడీ గారికి, బీజేపీ కి మూడు రాష్ట్రాల ప్రజలు వెన్నంటి ఉన్నారన్నారు.
Also Read : Putin: పుతిన్ వైభోగం మామూలుగా లేదుగా.. రూ.990 కోట్ల ఎస్టేట్‌లో లవర్‌తో రహస్య జీవనం
త్రిపుర రాష్ట్రంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కేవలం అధికారం కోసం పొత్తులు పెట్టుకున్నారని, ఆ పార్టీల కలయికను ప్రజలు తిప్పికొట్టారని డాక్టర్ లక్ష్మణ్ దుయ్యబట్టారు. ఇన్నాళ్లు వామపక్ష తీవ్రవాదం, ఇతర తీవ్రవాదం వైపుకు బలవంతంగా నెట్టేయబడ్డ రాష్ట్రాల లో శాంతిని నెలకొల్పి ఈశాన్య రాష్ట్రాలను అష్టలక్ష్ములుగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. నాగాలాండ్ లో మెజారిటీ క్రిస్టియన్ ప్రజలు ఉన్నా కూడా కేవలం అభివృద్ధి కోసమే ప్రజలు బీజేపీ ని ఆశీర్వదించారని అన్నారు. మేఘాలయ తో పాటు మూడు రాష్ట్రాలలో కూడా డబల్ ఇంజిన్ సర్కారు రావడం మంచి పరిణామం అని కొనియాడారు. నిరంతరం మోడీని దూషించే కేసీఆర్ వారి పార్టీ నాయకులు వచ్చే ఎన్నికల్లో ఓటమికి సిద్ధంగా ఉండాలని, తెలంగాణ లో కూడా బీజేపీ పార్టీ డబల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటు చేయడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.
Also Read : Allu Arjun: అయ్యిందా.. బాగా అయ్యిందా.. అది రూమర్ అని తెలిసిందా..?