Allu Arjun: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా మారాడు. అందులో కాస్తా గ్యాప్ దొరికినా కుటుంబంతో వెకేషన్ కు వెళ్ళిపోతున్నాడు. పుష్ప తరువాత బన్నీ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మధ్యనే బన్నీ బాలీవుడ్ లో అడుగుపెడుతున్నట్లు వార్తలు గుప్పుమన్న విషయం తెల్సిందే. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్,నయనతార జంటగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం జవాన్. ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయం తెలియడంతో బన్నీ ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. షారుఖ్ సినిమాలో బన్నీ గెస్ట్ అంటే.. అది మా హీరో రేంజ్ అంటూ చెప్పుకొచ్చేశారు. అయితే వారందరికీ ఒక బ్యాడ్ న్యూస్.. ఈ సినిమాలో నటించడానికి బన్నీ నో చెప్పాడట.
Heroines:పెళ్ళైన డైరెక్టర్లతో ఎఫైర్స్ నడిపిన స్టార్ హీరోయిన్లు వీరే..
విషయం ఏంటంటే.. అట్లీ.. బన్నీని గెస్ట్ గా చూపించడానికి చాలా ప్రయత్నాలు చేశాడట.. అల్లు అర్జున్ తో మాట్లాడి, ఓకే చేయించడానికి చాలా కష్టపడ్డాడట. కానీ, అల్లు అర్జున్ ఈ ఆఫర్ ను చాలా సున్నితంగా తిరస్కరించాడని టాక్. ప్రస్తుతం బన్నీ.. తాన్ ఫోకస్ మొత్తం పుష్ప 2 కోసమే అని, ఆ సినిమా అయ్యేవరకు వేరే సినిమా గురించి ఆలోచించనని చెప్పాడట. దీంతో ఈ సినిమాలో బన్నీ నటిస్తున్నాడు అనేది రూమర్ మాత్రమే అని అర్దమయ్యిపోయింది. షారుఖ్ సినిమాలో బన్నీ నటిస్తున్నాడు అని ఆనందపడినఫ్యాన్స్ ఇప్పుడు ఒక్కసారిగా నిరాశ చెందారు. ఇక మిగతావారు మాత్రం వారిని ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. అయ్యిందా.. బాగా అయ్యిందా.. అది రూమర్ అని తెలిసిందా..? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ వార్తలో కూడా నిజ ఎంత అనేది తెలియాల్సి ఉంది.