Naini Rajender Reddy: ప్రజలను మభ్య పెట్టడానికి మేడిగడ్డకు వెళ్తున్నారని వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హన్మకొండ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మీ ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు, రాజుల కాలంలో కూడా జరగలేదని అన్నారు. సిగ్గు శరం లజ్జ లేకుండా థర్డ్ డిగ్రీ ఉపయోగించారని ఆరోపణ చేస్తున్నారని అన్నారు. ఎంజీఎంలో బ్రతికున్న మనుషులను ఎలుకల కొరకు తింటుంటే కూడా స్పందించని వీరు ఇప్పుడు మాట్లాడుతున్నారని మంపడ్డారు. ప్రజలను మభ్య పెట్టడానికి మేడిగడ్డకు వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు చేసిన అవినీతి అరాచకాలన్ని మాకాడ ఉన్నాయి, సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు.
Read also: Kishan Reddy: బీజేపీ అభ్యర్థుల జాబితా ఎప్పుడైనా రావొచ్చు..!
హాస్పిటల్ పేరు చెప్పి 800 కోట్లు ఎత్తుకపోయిన దొంగల ముఠా మీదన్నారు. అవినీతికి స్పెషలిస్ట్ మాన మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అని కీలక వ్యాఖ్యలు చేశారు. మీకు సిగ్గు శరం ఉంటే రాజకీయాలనుంచి తప్పుకోవాలి, పోలీస్ స్టేషన్ లో సరెండర్ కావాలన్నారు. యూనివర్సిటీలో విద్యార్థులు ధర్నా చేస్తున్నారంటే పారిపోయిన ఎదవలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాళాలు, చెరువులు, కుంటలు కబ్జా చేశారు మీరు.. ఆ లెక్కలన్నీ బయటికి తీస్తున్నామన్నారు. 15 సంవత్సరాల కాలంలో అసెంబ్లీలో వినయ్ భాస్కర్ ఒక్కసారి కూడా మాట్లాడలేదని మండిపడ్డారు. మీ పార్టీ క్యాంప్ ఆఫీస్ ని అక్కడ నుంచి తొలగించాలన్నారు. దానివల్ల లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు.
Read also: Adilabad Traffic: మోడీ పర్యటన.. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు
వరంగల్ పార్లమెంట్ ఎలక్షన్ ఇంచార్జి ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి మాట్లాడుతూ.. ప్రజలకు ఆరు గ్యారంటీలు కాకుండా ఇంకా చాలా ఇచ్చామన్నారు. దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏర్పడడం చాలా అవసరమే అన్నారు. దేశం నుంచి ద్వేషం పోవాలంటే మోడీ పోవాలన్నారు. 10 సంవత్సరాల మీ పాలనలాలో ప్రజలు కోల్పోయింది చాలన్నారు. మేడిగడ్డ కూలినట్టే బీఆర్ఎస్ పార్టీ కూడా పూర్తిగా కూలిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Mallu Bhatti Vikramarka: మూసి రివర్ నిర్లక్ష్యం కావడం వల్లనే డ్రైనేజీగా మార్చారు..!