అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో క్వశ్చన్ పేపర్ లీక్ కలకలం సృష్టించింది. పరీక్ష ప్రారంభం కాకముందే సంస్కృతం క్వశ్చన్ పేపర్ వాట్సాప్‌లో హల్చల్ చేసింది. వర్షం కారణంగా నిన్న జరగాల్సిన పరీక్షలను రద్దు చేసి వైవీ యూనివర్సిటీ అధికారులు నేడు నిర్వహిస్తున్నారు.
UGC- NET2024: ఈ ఏడాది జరిగిన యూజీసీ నెట్ జూన్-2024 పరీక్షలో అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక నివేదిక అందడంతో కేంద్ర ప్రభుత్వం ఈ పరీక్షను రద్దు చేసింది. ఆ పరీక్షా పత్రాన్ని ఆదివారం నాడే లీక్ చేశారని సీబీఐ వర్గాలు తెలిపాయి.
టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితులు ప్రవీణ్ కుమార్,రాజశేఖర్ రెడ్డిలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారుల బృందం రెండోరోజు చంచల్‌గూడ సెంట్రల్ జైలులో ప్రశ్నించనుంది.
పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ పై విద్యాశాఖ మంత్రి సభితా ఇంద్రారెడ్డి స్పందించారు. పదవ తరగతి పరీక్షల విషయంలో జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు పాఠశాల యాజమాన్యాలు, పోలీసు విభాగం, పోస్టల్ డిపార్ట్ మెంట్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ఆర్టీసీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నానని ట్విట్టర్ వేదికగా తెలిపారు.
బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ ఇవాల సిట్ ముందు హాజరు కావాల్సి ఉండగా ఊహించని పరిణామం నెలకొంది. బండి సంజయ్ సిట్ కు లేఖ రాశారు. తను సిట్ ముందు హాజరుకాలేనని, అసలు సిట్ నోటీసులు అందలేదని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ కేసులో తొలుత ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ఆయన కొడుకు కేటీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.
తెలంగాణలో పాలిటెక్నిక్ ప్రశ్నా పత్రాలు లీక్ వ్యవహారం కలకలం సృష్టించింది.. దీంతో.. ఈ నెల 8, 9 తేదీల్లో జరిగిన రెండు పాలిటెక్నిక్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది తెలంగాణ సాంకేతిక విద్యా మండలి. ఇక, రద్దు చేసిన ఆ రెండు పరీక్షలు ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించనున్నట్టు వెల్లడించారు.. అయితే, ఫిబ్రవరి 8వ తేదీన ప్రారంభమైన పాలిటెక్నిక్ పరీక్షలు ప్రస్తుతం కొనసాగుతూనే ఉన్నాయి.. ఇదే సమయంలో హైదరాబాద్శివారులోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్మండలం బాటసింగారంలోని…