కేంద హోంశాఖ మంత్రి అమిత్ షా నిన్న తుక్కుగూలో నిర్వహించి భారీ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలకు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైల్వే స్టేషన్లో చాయ్ అమ్మాడు… ఇప్పుడు దేశాన్నే అమ్మేసేందుకు మోడీ సిద్ధం అయ్యారని ఆయన మండిపడ్డారు. ప్రైవేటు కంపెనీల్లో కేంద్రం ఎందుకోసం పెట్టుబడులు పెట్టింది.? ప్రభుత్వ సంస్థలు మూసేస్తున్నవ్. నీ కార్పొరేట్ దోస్తుల కోసమా? అని ఆయన ప్రశ్నించారు. అసమర్థ దద్దమ్మ ప్రధాన మంత్రి దేశాన్ని పరిపాలిస్తున్నాడు. మూడు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేసిన మోడీ… ఆ రాష్టాన్ని అభివృద్ధి చేయలేక పోయాడు. డబుల్ ఇంజిన్ ఉన్న రాష్టాల్లో ఏం పీకినవ్ అంటూ కేటీఆర్ అగ్రహం వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్లలో కరెంట్ చార్జీలు 50 పైసలు పెంచితే బీజేపీ నేతలు ఆకాశం విరిగిపడ్డట్టు చేశారు.
సామాన్యులకు సచ్చేదిన్… బీజేపీ మిత్రులకు అచ్చేదిన్ అంటూ సెటైర్ వేశారు. సామాన్యులను గోస పెట్టినోడు నిజాం కాదా? 700 మంది రైతుల చావుకు కారణమైన వారు నియంత కాదా? రాజ్యాంగ వ్యతిరేకంగా అమిత్ షా ధాన్యం కొనుగోలు పై వ్యాఖ్యలు చేశారు. గల్లా పట్టి ధాన్యం కొనుగోలు చేయిస్తాం.. న్యాయస్థానాలను ఆశ్రయిస్తాము. తెలంగాణ ప్రజలకు నాట్లు వేయడమే కాదు ఓట్లతో వేటు వేయడం కూడా వచ్చు. తంబాకు, లవంగం కాదు అధికారం ప్లీజ్ ప్లీజ్ అని అడిగితే ఇవ్వడానికి. పీఎం కిసాన్… కౌలు రైతులకు ఎందుకు ఇవ్వరు? అని ధ్వజమెత్తారు. మా పథకాలు కాపీ కొట్టింది బీజేపీనే. అజాది, అమృత్, సరోవరం ఏమి మోడీ రాజ్యంలో లేదు ఆయన స్పష్టం చేశారు.