Kishan Reddy: సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గంలోని అంబర్ పేట అసెంబ్లీ నియోజకవర్గంలో నేటి నుంచి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభమైంది. స్థానికులతో సమస్యలను అడుగుతూ ముందుగు సాగున్న నేపథ్యంలో.. స్థానికులు ప్రజలు తమ సమస్యలను కిషన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. పలువురు ప్రజలు పాదయాత్ర చేస్తున్న కిషన్ రెడ్డికి విద్యుత్ సమస్య గురించి వివరించారు. ఈ క్రమంలోనే సంబంధిత అధికారులు అందుబాటులో లేకపోవడంపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులకు ఫోన్ చేసిన కిషన్ రెడ్డి.. సమస్యల పరిష్కారం కోసం తాము ప్రజల్లో తిరుగుతుంటే మీరెక్కడ? అంటూ ప్రశ్నించారు.
Read also: IT Raids: శ్రీ ఆదిత్య హోమ్స్ లో ముగిసిన ఐటీ సోదాలు.. విచారణకు హాజరుకావాలని నోటీసులు
తక్షణమే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఇక్కడ స్థానిక ఎంపీ తిరుగుతుంటే అధికారులకు సమాచారం ఇచ్చిన కూడా అధికారులు రాకపోతే ఎలా? అని కిషన్ రెడ్డి మండిపడ్డారు. కాగా.. బస్తీల్లో వాటర్ పైప్ లైన్ కోసం తీసిన రోడ్ మధ్యలో తీసిన కాలువలను వెంటనే లెవలింగ్ చేయాలంటూ అధికారులకు ఆదేశించారు. పైప్ లైన్ కోసం తీసిన కాలువలు గుంతలుగా మారడంతో రోడ్ పై నడవలేకపోతున్నామని ఇబ్బంది పడుతున్నామని స్థానికులు తెలిపారు. దీంతో కిషన్ రెడ్డి వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలంటు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Hair Growth: జుట్టు చివర్లను కత్తిరిస్తే.. వేగంగా పెరుగుతుందా?