Minister Jagadish Reddy: ఉపయోగంలేని రూ.2 వేల నోటు ఎందుకు తెచ్చారంటూ మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.2000 నోట్ల రద్దుపై ఆర్బీఐ నిర్ణయంపై మంత్రి జగదీశ్ రెడ్డి స్పందిస్తూ.. ఉపయోగం లేకపోతే రూ.2 వేల నోటు ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. అమలులో తెచ్చిన నోట్లు మళ్లీ ఎందుకు రద్దు చేస్తున్నారని మండిపడ్డారు. రూ.2000 నోట్ల రద్దుతో దేశాభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందన్నారు. పెట్టుబడిదారుల రహస్య ఎజెండాలో భాగమే రద్దు అని విమర్శించారు. రూ.2000 నోట్లను రద్దు చేయడం మోడీ ప్రభుత్వం తిరోగమన చర్య అని వ్యాఖ్యానించారు. నోట్ల రద్దు ఎందుకు చేశారో తెలియదన్న ఆయన.. ఎంత నల్లధనం వెలికితీశారో తెలియదన్నారు. దేశ పరిపాలన ప్రజల కోసం కాదని, కొద్ది మంది కోసమేనని అన్నారు.
Read also: AC Side Effects: ఎండ ఎక్కువగా ఉందని ఏసీలో కూర్చుంటున్నారా.. తస్మాత్ జాగ్రత్త
మోడీ మత విశ్వాసాలకు అతీతంగా ప్రజలను పేదరికంలో ఉంచే భూస్వామ్య భావజాలంలో నోట్ల రద్దు ఒక భాగమని మంత్రి మండిపడ్డారు. నోట్ల రద్దుతో లాభం ఉంటే ప్రచారం ఎందుకు లేదని ప్రశ్నించారు. రేషన్ షాపులో మోడీ ఫోటో లేకుంటే గగ్గోలు పెట్టిన ఆర్థికమంత్రి మరి ఇప్పుడు రూ.2వేల నోట్లు రద్దుపై ఎందుకు ప్రచారం చేయడం లేదని ఆర్థికమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పతనం వెనుక దాగి ఉన్న రహస్యం ఎజెండా ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్రలో బీఆర్‌ఎస్ విజృంభణ ప్రారంభించినట్లు స్పష్టమవుతోంది. ఢిల్లీ వరకు ఇదే ప్రభంజనం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల వరకు దేశ వ్యాప్తంగా బలపడతామని విశ్వాసం వ్యక్తం చేశారు. కర్నాటకలో తాము లేకపోవడం వల్లే కాంగ్రెస్ గెలిచిందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.
Toor dal rates hiked: కదంతొక్కిన కందిపప్పు.. రూ. 140 నుంచి రూ.180 పెరిగే ఛాన్స్..!