తెలంగాణ ధాన్యం కొనుగోలు చేయాలని కోరేందుకు కేటీఆర్‌తో కలిసి ఢిల్లీలో పీయూష్ గోయల్ కలిశామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. పంటల కొనుగోలు బాధ్యత కేంద్రానిది, రాజ్యాంగం ప్రకారం అది కేంద్రం బాధ్యత అని విజ్ఞప్తి చేశామన్నారు. దానికి పీయూష్ గోయల్ వెకిలినవ్వు నవ్వారు .. ఇప్పటికే నిల్వలు మురిగిపోతున్నాయి .. కొననే కొనం అని అన్నారని వెల్లడించారు. మాది కొత్త రాష్ట్రం.. ఇప్పుడే ఎదుగుతున్న రాష్ట్రం అని కోరినా పట్టించుకోలేదు .. క్రాప్ చేసుకోండి అని ఉచిత సలహాలు ఇచ్చారు.
అప్పుడే ఈ విషయం మీద స్పందించాలి.. కేంద్రాన్ని ఒప్పించాలని కిషన్ రెడ్డి, బండి సంజయ్ లను కోరితే నోరు తెరవలే.. ఈ రోజు రైతులను రెచ్చగొడుతున్నారు.. కేంద్రం కొనడం లేదు .. కొనే అవకాశం, నిల్వ చేసే అవకాశం రాష్ట్రానికి ఇవ్వడం లేదు. బీజేపీ నేతలు వడ్ల కొనుగోళ్లపై కేంద్రమంత్రులను నిలదీయాలి. జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యత వహించాలి. పండిన ప్రతి గింజను కండీషన్ లేకుండా కొనుగోలు చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు.