ఈ ఏడాది యాసంగి సీజన్‌లో ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 6,832 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ పౌరసరఫరాలశాఖ కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన ధాన్యం దిగుబడికి అనుగుణంగా ఇప్పటి వరకు 30 జిల్లాల్లో 5299 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్టు ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం నాటికి 76,495 మంది రైతులనుంచి రూ. 1483 కోట్ల విలువ చేసే 7.59 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు ఆయన వెల్లడించారు.…
వరి కోసం తెలంగాణలో అధికార పార్టీకి విపక్షాలకు మధ్య వార్ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు చేయమని చెప్పడంతో యాసంగిలో వరి ధాన్యం వేయకూడదని సీఎం కేసీఆర్ వెల్లడించారు. అయితే విపక్షాలు మాత్రం వరి వేయండి అంటూ రైతులకు సందేశాలు ఇస్తున్నాయి. అయితే దీనిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్‌కు సంబంధించి ప్రత్యక్ష ప్రసారాన్ని ఈ క్రింద ఇచ్చిన లింక్‌లో వీక్షించండి.
తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై ఇంకా స్పష్టత నెలకొనడం లేదు. దీంతో ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపు మేరకు నేడు టీఆర్‌ఎస్ శ్రేణులు నిరసనలు చేపట్టనున్నాయి. జిల్లాల్లో, నియోజకవర్గాల్లో, మండలాల్లో ఉన్న టీఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలో పాల్గొనాలని కేసీఆర్ కోరారు. రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో చేపట్టే నిరసనల్లో ఆయా ఎమ్మెల్యేలు పాల్గొనాలని కేసీఆర్ సూచించారు. ఈ నేపథ్యంలో ధాన్యం సేకరణలో కేంద్ర తీరుపై ఊరురా టీఆర్ఎస్…
ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య వాడివేడిగా మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్ సభ్యుల వ్యవహార శైలిని చూసి తెలంగాణ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. అంతేకాకుండా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడతున్నారని ఆయన అన్నారు. ఇంకా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేని దుస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందని, ధాన్యం సేకరించాలని ఎమ్మెల్యేలే ఆందోళన చేస్తున్నారని…
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలల్లో గంప గోవర్థన్ రూటే సపరేటుగా ఉంటుంది. ఆయన దేనిపైన స్పందించినా తన దైనతీరుతో వెళ్తుంటారు. తాజాగా ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే అయిన గంప గోవర్థన్ కలెక్టరేట్ కి రైతులతో పాటు ధాన్యంలోడ్‌తో ఉన్న లారీ తీసుకువచ్చారు. 3వ తేదీ నుండి రైతులను రైస్ మిల్ యజమానులు ఇబ్బంది పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తి చేశారు. జిల్లా లో కొందరు రైస్ మిల్స్ యజమానులు రైతులను ఇబ్బంది పెడుతున్నారని, జిల్లాలో మిగిలిన 20 శాతం ధాన్యం…
ధాన్యం కొనుగోలుపై తెలంగాణలో బీజేపీ, టీఆర్‌ఎస్ నేతలు ఒకరిపైఒకరి విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పచ్చి అవాస్తవాలు చెబుతున్నారని, ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్రం కేంద్రానికి కేవలం సహకారం మాత్రమే అందిస్తుందని అన్నారు. ధాన్యం కొనుగోళ్లు, మిల్లింగ్, ఎగుమతి అంతా ఎఫ్‌సీఐ బాధ్యతేనని, తెలంగాణ నుండి బియ్యం తరలించాలని పలుమార్లు కలెక్టర్లు, సివిల్ సప్లైస్…
ధాన్యం కొనుగోలు విషయమై నేడు సీఎం కేసీఆర్ ఢిల్లీలో మూడో రోజు పర్యటిస్తున్నారు. అయితే మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో టీఆర్‌ఎస్ నేతలు భేటీ కానున్నారు. అయితే కేసీఆర్ ఆధ్వర్యంలో మంత్రులు గంగుల కమలాకర్, నిరంజన్‌రెడ్డి ఎంపీ నామా నాగేశ్వర్‌రావు లు ఈ భేటీలో పాల్గొననున్నారు. అయితే ఈ భేటీలో తెలంగాన నుంచి ప్రతి సంవత్సరం ఎంత ధాన్యాన్ని ఏ రూపంలో కొనుగోలు చేస్తారో.. ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని టీఆర్ఎస్…
కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మహాధర్నాకు పిలుపు నిచ్చిన విషయం తెలసిందే… ఈ నేపథ్యంలో నేడు ఇందిరాపార్క్ వద్ద భారీ ఎత్తున్న టీఆర్‌ఎస్ శ్రేణులతో మహాధర్నా నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ధర్నా ముగిసిన తర్వాత రాజ్ భవన్ కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇందిరా పార్కు నుంచి పాదయాత్రగా వెళ్లే అవకాశం కనిపిస్తోంది. రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలవనున్నారు.. అయితే కేంద్ర ప్రభుత్వం…
తెలంగాణ ధాన్యం కొనుగోలు చేయాలని కోరేందుకు కేటీఆర్‌తో కలిసి ఢిల్లీలో పీయూష్ గోయల్ కలిశామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. పంటల కొనుగోలు బాధ్యత కేంద్రానిది, రాజ్యాంగం ప్రకారం అది కేంద్రం బాధ్యత అని విజ్ఞప్తి చేశామన్నారు. దానికి పీయూష్ గోయల్ వెకిలినవ్వు నవ్వారు .. ఇప్పటికే నిల్వలు మురిగిపోతున్నాయి .. కొననే కొనం అని అన్నారని వెల్లడించారు. మాది కొత్త రాష్ట్రం.. ఇప్పుడే ఎదుగుతున్న రాష్ట్రం అని కోరినా పట్టించుకోలేదు .. క్రాప్ చేసుకోండి అని…