Senior Naresh: అలరిస్తోన్న నరేశ్ నవ్వులాట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Senior Naresh: కొందరు అదే పనిగా ఏదో ఒక పనిచేసి, వార్తల్లోకి ఎక్కుతూ ఉంటారు. అలాంటి వారిలో నేనూ ఉన్నానని చాటుకుంటున్నారు సీనియర్ యాక్టర్ నరేశ్. ఈ తరం ప్రేక్షకులకు కేరెక్టర్ యాక్టర్ గా సుపరిచితులైన నరేశ్ ఈ యేడాది ఆరంభంలోనే తాను నటి పవిత్ర లోకేశ్ ను పెళ్ళాడబోతున్నట్టు ప్రకటించారు. అంతకు ముందు నరేశ్, పవిత్ర జోడీపై భలేగా పుకార్లు షికారు చేశాయి. నరేశ్ ఇప్పటికే మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. విడాకులు తీసుకున్న తరువాతే పెళ్ళాడుతూ పోయిన నరేశ్ పై ఆయన మూడో భార్య విరచుకు పడడం కూడా మీడియాలో భలేగా హల్ చల్ చేసింది. ఏది ఏమైనా ఆరుపదులు చూసిన నరేశ్, నాలుగో పెళ్ళి చేసుకోబోవడం వార్తయింది. ఆయన వ్యక్తిగతం మనకెందుకు అని ఈ విషయాన్ని అలా ఉంచితే, చిత్రసీమలో ‘తల్లికి తగ్గ తనయుడు’ అని కొందరే అనిపించుకున్నారు. అలాంటి వారిలో నరేశ్ కూడా ఉన్నారని చెప్పవచ్చు.
ప్రస్తుతం నరేశ్ ను చాలామంది ‘సీనియర్ నరేశ్’ అంటూ ఉంటారు. కృష్ణ సతీమణి విజయనిర్మల తనయుడే నరేశ్. కృష్ణ హీరోగా నటించిన కొన్ని చిత్రాలలో బాలనటునిగా కనిపించిన నరేశ్, తల్లి దర్శకత్వం వహించిన ‘ప్రేమసంకెళ్ళు’తో ముందుగా కెమెరా ముందుకు వచ్చారు. అయితే ఆ సినిమా నిర్మాణంలో ఉండగానే జంధ్యాల తెరకెక్కించిన ‘నాలుగు స్తంభాలాట’ లో నవ్వులు పూయిస్తూ జనం ముందు నిలిచారు. ఆ చిత్రంతోనే నటుడిగా మంచి పేరు సంపాదించారు. విజయనిర్మల సైతం బాలనటిగా అలరించిన తరువాత కథానాయికగానూ మెప్పించారు. దాంతో అందరూ తల్లికి తగ్గ తనయుడు అంటూ నరేశ్ ను అభినందించారు.
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
తల్లి నటి కావడంతో నరేశ్ కూడా చిన్నతనంలోనే ఆమె నటించిన సినిమాల్లో బాలనటునిగా కనిపించారు. హిందీ ‘లవ్ స్టోరీ’ ఆధారంగా విజయనిర్మల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమసంకెళ్ళు’తో తొలిసారి కెమెరా ముందుకు వచ్చారు నరేశ్. కానీ, అది అంతగా అలరించలేకపోయింది. జంధ్యాల దర్శకత్వంలోనే రూపొందిన “రెండు జళ్ళ సీత, శ్రీవారికి ప్రేమలేఖ, పుత్తడి బొమ్మ, శ్రీవారి శోభనం, మొగుడుపెళ్ళాలు, చూపులు కలసిన శుభవేళ, హై హై నాయకా, బావా బావా పన్నీరు, ప్రేమ ఎంత మధురం” వంటి చిత్రాలలో నవ్వులు పూయిస్తూనే సాగారు నరేశ్. వీటిలో ‘పుత్తడి బొమ్మ’లో ‘మూగమనసులు’లోని ఏయన్నార్ లాంటి బరువైన పాత్ర ధరించారు. కానీ, అది జనం ముందు దరువు వేయలేకపోయింది. జంధ్యాల దర్శకత్వంలో పది చిత్రాలలో నటించినా, వాటిలో మూడు సినిమాలే బాక్సాఫీస్ వద్ద సత్తా చాటగలిగాయి. ఇక జంధ్యాల శిష్యుడు ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వంలో నరేశ్ హీరోగా రూపొందిన ‘జంబలకిడిపంబ’ పేరుకు తగ్గట్టే నవ్వులతో పంబరేగ గొట్టింది.
పి.యన్. రామచంద్రరావు రూపొందించిన ‘చిత్రం భళారే విచిత్రం’ లో స్త్రీ పాత్రలో నరేశ్ అనితరసాధ్యంగా అలరించారు. వంశీ తెరకెక్కించిన ‘శ్రీకనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్’లోనూ నరేశ్ నటన భలేగా ఆకట్టుకుంది. గుణశేఖర్ ‘సొగసు చూడతరమా’ లోనూ నరేశ్ మురిపించారు. ఆ తరువాత నరేశ్ హీరోగా నటించిన చిత్రాలేవీ ఆకట్టుకోలేకపోయాయి. దాంతో తెలివిగా కేరెక్టర్ రోల్స్ లోకి షిఫ్ట్ అయ్యారు నరేశ్. అప్పటి నుంచీ ఇప్పటి దాకా కితకితలు పెడుతూనే ఉన్నారు. ‘మా’ అధ్యక్షునిగానూ నరేశ్ పనిచేశారు. ఇక ఆ తరువాత జరిగిన ‘మా’ ఎన్నికల సమయంలో కీలక పాత్ర పోషించి, తాను మద్దతు పలికిన మంచు విష్ణు విజయం కోసం కృషి చేశారు. బీజేపీలో కొనసాగుతున్నారు. మరి త్వరలోనే నాలుగో వివాహం చేసుకుంటున్న నరేశ్ మరిన్ని చిత్రాలలో తనదైన అభినయంతో అలరిస్తారని ఆశిద్దాం.
తాజావార్తలు
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!