గోషామహల్లో హిందుత్వకు హిందుత్వే కౌంటర్ వేయబోతోందా? తెర మీదికి మరో కాషాయ మిసైల్ దూసుకు రాబోతోందా? ఉప ఎన్నికంటూ జరిగి రాజాసింగ్ తిరిగి పోటీ చేస్తే… ఇన్నాళ్ళు ఆయనకున్న బలం మీదే బీజేపీ దెబ్బకొడుతుందా? అందుకు నేను రెడీ అంటూ అభ్యర్థి కూడా సిద్ధమైపోయారా? ఇంతకీ ఎవరా అభ్యర్థి? అసలు నియోజకవర్గంలోని పరిణామాలు ఎలా మారే అవకాశం ఉంది? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయాలని గట్టిగా పావులు కదుపుతోంది బీజేపీ. 2023లో కూడా అదే…
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు పోలీసులు. 41ఏ సీఆర్పీసీ కింద మంగళ్‌హాట్ పోలీసులు నోటీసులు అందించారు. అజ్మీర్ దర్గాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని గతేడాది ఆగస్టులో కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌లో రాజాసింగ్‌పై కేసు నమోదుచేశారు.