Mynampally: మైనంపల్లి హనుమంత రావు నివాసంలో కాంగ్రెస్ కార్యర్తల సందడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mynampally: కుత్బుల్లాపూర్ దూలపల్లిలోని మైనంపల్లి హనుమంతరావు నివాసంలో సందడి వాతావరణ నెలకొంది. మైనంపల్లి నివాసం వద్దకు కాంగ్రెస్ కార్యర్తలు భారీగా చేరుకుని సందడి చేశారు. కుత్బుల్లాపూర్,మల్కాజిగిరి నియోజక వర్గాల నుంచి మైనం పల్లి నివాసానికి కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు భారీగా చేరుకున్నారు. మైనంపల్లికి కుత్బుల్లాపూర్ టి.పిసిసి ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు అభినందించారు. మీ సేవలు మాకు కావాలని కాంగ్రెస్ కార్యకర్తలు కోరారు. మీ లాంటి సీనియర్లు కాంగ్రెస్ కు చాలా అవసరమని, మీసేవలు తెలంగాణ ప్రజలకు అవసరమని మైనంపల్లిని కోరారు. మైనంపల్లి బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ రానున్న నేపథ్యంలో ఇంటివద్ద కాంగ్రెస్ నేతలు భారీ ఎత్తున చేరుకుని అభినందనలు తెలుపుతున్నారు. కొన్ని అపోహలు సృష్టించి రెండు నియోజక వర్గాల్లో (కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి) పోటీ చేస్తానని కొందరు మాట్లాడే మాటల్లో వాస్తవం లేదని మైనంపల్లి కొట్టి పడేశారు. మల్కాజిగిరి నియోజక వర్గం నుండి పోటీ చేస్తానని మైనం పల్లి హనుమంత్ రావు స్పష్టం చేశారు.
మైనం పల్లి రాజీనామా..
Also Read
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నిన్న(శుక్రవారం) వీడియో రూపంలో పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు మైనంపల్లి ప్రకటించారు. ఇప్పుడు ఎమ్మెల్యే రాజీనామా లేఖను బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు పంపారు. “నేను భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీకి రాజీనామా చేస్తున్నాను. నేను నా నియోజకవర్గం మల్కాజిగిరి అసెంబ్లీ టిక్కెట్ను తిరస్కరించాను. నా మద్దతుదారులు మరియు నియోజకవర్గాలతో చాలా చర్చలు మరియు సంప్రదింపుల తర్వాత నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్టీలో చేరినప్పుడు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే లక్ష్యంతో GHMCలో ఒక్క కార్పొరేటర్ లేకుండా మల్కాజిగిరి లోక్‌సభ స్థానంలో ఎదురుగాలులు వీస్తున్నాయి.పార్టీ కోసం,ప్రజల కోసం కష్టపడ్డాను.గ్రేటర్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షునిగా నా కృషిని గుర్తించినందుకు ధన్యవాదాలు అని తెలిపారు. 2016 GHMC ఎన్నికల్లో పార్టీని గెలిపించి, ఎమ్మెల్సీగా, ఆ తర్వాత ఎమ్మెల్యేగా అవకాశం కల్పించడం కోసం.. అయితే ఇటీవల పార్టీలో జరుగుతున్న పరిణామాలతో తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనయ్యానని తెలిపారు.. దాని పనితీరులో ప్రజాస్వామ్యం, పారదర్శకత లేదు. పార్టీ నాయకత్వం కిందిస్థాయి కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలను పట్టించుకోకుండా ఏకాభిప్రాయం, సంప్రదింపులు లేకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంది. పార్టీ శ్రేణుల అధిష్టానికి విరుద్ధంగా టీఆర్‌ఎస్ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చడమే ఇందుకు నిదర్శనం అన్నారు. గతంలో మీరు అందించిన సహకారం, మద్దతుకు ధన్యవాదాలు’ అని మైనంపల్లి హనుమంతరావు తన రాజీనామా లేఖలో రాశారు.
Rats Attack: పసికందుపై ఎలుకల గుంపు దాడి…ఎంత దారుణంగా కొరికేశాయంటే?
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!