TPCC Chief Mahesh Kumar Goud: పుట్టుకతో చక్రవర్తులు అవుతారు.. కానీ పాపన్న పోరాడి రాజయ్యాడు..
- సెక్రటేరియట్ ముందు సర్వాయి పాపన్న విగ్రహం
- జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే విగ్రహాలు కూడా
- రాహుల్ గాంధీ నినాదంతో కులగణన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో బీసీలతో పాటు అన్ని కులాలకు సమాన అవకాశాలు కల్పించేందుకు రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ అన్నారు. సర్వాయి పాపన్న వంటి వీరుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సర్వాయి పాపన్న గొప్పతనాన్ని వివరిస్తూ మహేష్ కుమార్ మాట్లాడుతూ.. ఎంతో మంది రాజులు, చక్రవర్తులు చరిత్రలో ఉన్నప్పటికీ, చిన్న జాతిలో పుట్టి పోరాటంతో రాజుగా ఎదిగిన వ్యక్తి సర్వాయి పాపన్న అని అన్నారు. పుట్టుకతోనే చక్రవర్తులుగా మారిన వారితో పోలిస్తే, పాపన్న పోరాడి రాజయ్యారని పేర్కొన్నారు. “మేము రాజులమే.. మేము కూడా పాలించగలుగుతాం” అనే ఆత్మవిశ్వాసాన్ని పేద, వెనుకబడిన వర్గాల్లో కల్పించిన గొప్ప వ్యక్తి సర్వాయి పాపన్న అని మహేష్ కుమార్ అన్నారు. పేద వర్గాల కోసం పాపన్న పోరాటం చేశారని గుర్తు చేశారు.
సెక్రటేరియట్ ముందు సర్వాయి పాపన్న విగ్రహం
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కుల పెద్దలతో చర్చించి సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మహేష్ కుమార్ తెలిపారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా మాట్లాడినట్లు చెప్పారు. సెక్రటేరియట్ ముందు సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించినట్లు ఆయన తెలిపారు. త్వరలోనే విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని వెల్లడించారు. విగ్రహాలు కేవలం పూలమాలలు వేసేందుకు మాత్రమే కాదని, ఆయా మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగేందుకే విగ్రహాలను ఏర్పాటు చేయాలని మహేష్ కుమార్ అన్నారు.
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే విగ్రహాలు కూడా
సామాజిక సంస్కర్తలు జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే విగ్రహాలను కూడా ఆవిష్కరించనున్నట్లు మహేష్ కుమార్ తెలిపారు. సమాజంలోని వెనుకబడిన వర్గాలు, మహిళలు, పేదల కోసం పోరాడిన మహనీయుల స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
రాహుల్ గాంధీ నినాదంతో కులగణన
రాజకీయాలకు అతీతంగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారని మహేష్ కుమార్ పేర్కొన్నారు. “ఎవరు ఎంతో.. వారికి అంత” అనేది రాహుల్ గాంధీ నినాదమని తెలిపారు. అదే నినాదంతో తెలంగాణలో కులగణన చేపట్టామని అన్నారు. రాష్ట్రంలో కులగణనకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయని చెప్పారు. అయితే అసెంబ్లీలో కులగణనకు మద్దతు ఇచ్చిన బీజేపీ.. కేంద్ర స్థాయిలో మాత్రం దానిని అడ్డుకుంటోందని విమర్శించారు.
‘మేము ఎవరికీ వ్యతిరేకం కాదు’
బీసీలు తమ హక్కుల కోసం పోరాడితే కొందరు దానిని ఇతరులకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంగా చిత్రీకరిస్తున్నారని మహేష్ కుమార్ అన్నారు. “మా హక్కుల కోసం మేము పోరాడితే.. మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అంటున్నారు. మేము ఎవరికి వ్యతిరేకం కాదు” అని స్పష్టం చేశారు. అన్ని కులాలను కలుపుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. తమ కులం నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని తెలిసినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు మద్దతు ఇచ్చారని, కులగణన చేపట్టారని పేర్కొన్నారు. ఎవరినీ ఇబ్బందులకు గురి చేయకుండా అన్ని కులాలను కలుపుకుని సమాన అవకాశాలతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.
కులాల హక్కుల కోసం పార్టీలకు అతీతంగా పనిచేయాలి
మంత్రిగా ఉన్న సమయంలో శ్రీనివాస్ గౌడ్ పార్టీలకు అతీతంగా బీసీల కోసం, కులాల సంక్షేమం కోసం పనిచేశారని మహేష్ కుమార్ పేర్కొన్నారు. తాను పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బీసీలతో పాటు ఇతర కులాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని రాహుల్ గాంధీ సూచించారని తెలిపారు. ఈ క్రమంలో పార్టీ పదవుల్లో కూడా సామాజిక సమతుల్యతకు ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. 79 శాతం ఉపాధ్యక్ష పదవులను బీసీలకు ఇచ్చామని, అదే సమయంలో అన్ని కులాలకు సమానంగా అవకాశాలు కల్పించామని మహేష్ కుమార్ వెల్లడించారు. కులాల హక్కులు, సామాజిక న్యాయం వంటి అంశాల్లో రాజకీయ పార్టీలకు అతీతంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు, గౌరవం లభించేలా ముందుకు సాగడమే లక్ష్యంగా ఉండాలని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు