Rashmika as Geetanjali :-#AnimalTeaserOn28thSept#AnimalTheFilm #RanbirKapoor @RashmikaMandanna @bobbydeol @TriptiDimri #BhushanKumar
@SandeepReddyVanga @PranayReddyVanga #KrishanKumar @anilandbhanu @tseriesfilms @VangaPictures pic.twitter.com/UtLQvLac5C— Sandeep Reddy Vanga (@imvangasandeep) September 23, 2023
అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ రెడ్డి వంగ చేస్తున్న సినిమా ‘యానిమల్’. రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. డిసెంబర్ 1న సినిమా రిలీజ్‌కు రెడీ అవుతుండగా.. సెప్టెంబర్ 28న టీజర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదల అయిన యానిమల్ ప్రీ టీజర్ అదిరిపోయింది. మాస్క్ పెట్టుకుని ఊచకోత కోసిన రణ్ బీర్‌ను చూసి బాలీవుడ్ జనాలు షాక్ అయ్యారు. జస్ట్ ప్రీ టీజరే ఇలా ఉంటే.. ఇక టీజర్ ఇంకే రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా టీజర్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్. మరో నాలుగైదు రోజుల్లో యానిమల్ టీజర్ బయటికి రానుంది.
ఈ క్రమంలో సినిమాలో నటిస్తున లీడ్ క్యాస్టింగ్ ఫస్ట్ లుక్‌ను రివీల్ చేస్తున్నారు మేకర్స్. రీసెంట్‌గా అనిల్ కపూర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఒంటిమీద గాయాలతో కనిపిస్తున్న అనీల్ కపూర్.. సినిమాలో బల్బీర్ సింగ్‌గా కనిపించబోతున్నాడు. ఇక లేటెస్ట్‌గా హీరోయిన్ రష్మిక మందన లుక్ రివీల్ చేశారు. ఇందులో చాలా కూల్‌గా, సింపుల్ అండ్ హోమ్లీగా ట్రెడిషనల్ లుక్‌లో కనిపిస్తోంది రష్మిక. నిండైన చీరకట్టులో పక్కా నార్త్ అమ్మాయిలా ఉన్న రష్మిక, యానిమల్ సినిమాలో గీతాంజలి పాత్రలో నటిస్తున్నట్లుగా తెలిపారు మేకర్స్. ప్రస్తుతం రష్మిక లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం పుష్ప2తో పాటు ఇంకొన్ని సినిమాలతో బిజీగా ఉంది రష్మిక. మరి పుష్ప సినిమాలో డీ గ్లామర్ రోల్ శ్రీవల్లిగా కనిపించిన ఈ క్యూట్ బ్యూటీ.. యానిమల్‌లో గీతాంజలిగా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.