Worker Funny Idea : గుండు తెచ్చిన తంటా.. జుట్టుతో భలే ఐడియా వేసిన వ్యక్తి..!
- గుండు చేయించుకోవడంతో ఫేస్ రికగ్నిషన్ ఫెయిల్
- మహిళ జుట్టుతో యాప్‌ను బురిడీ కొట్టించిన కూలీ
- ఉపాధి హామీ పనుల్లో వైరల్‌గా మారిన జుగాడ్
- “మనోళ్ల ఐడియాలే టెక్నాలజీకి మాస్టర్” అంటున్న నెటిజన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Worker Funny Idea : మహబూబాబాద్ జిల్లాలో ఒక వింత, నవ్వులు పూయించే సంఘటన వెలుగుచూసింది. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం (MGNREGS) కూలీల హాజరు కోసం ప్రవేశపెట్టిన ‘ఫేస్ రికగ్నిషన్ యాప్’ (Face Recognition App) టెక్నాలజీ ఒక కూలీని చిత్రమైన కష్టాల్లోకి నెట్టింది. చివరికి అతను చేసిన ఒక క్రేజీ ప్రయోగం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం కొమటిపల్లి గ్రామానికి చెందిన మాల్యాల శ్రీనివాస్ అనే కూలీ ప్రతిరోజూ ఉపాధి హామీ పనులకు వెళ్తుంటాడు. అయితే, ఇటీవల అతను గుండు చేయించుకొని పనికి వెళ్లాడు. అక్కడ కూలీల హాజరు నమోదు చేసే సమయంలో ఫేస్ రికగ్నిషన్ యాప్ శ్రీనివాస్ ముఖాన్ని గుర్తించడానికి నిరాకరించింది. గతంలో జుట్టు ఉన్నప్పటి ముఖచిత్రం రికార్డుల్లో ఉండటంతో.. గుండుతో ఉన్న శ్రీనివాస్ ముఖాన్ని చూసి యాప్ పదే పదే రిజెక్ట్ (Reject) చేసింది.
Also Read
- Shankarpally : మేజర్‌ను మైనర్‌గా చూపి అక్రమ కేసు.. శంకర్పల్లి సీఐ, ఎస్ఐలపై యువతి సంచలన ఆరోపణలు!
- Online Betting App Scam: ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లపై ఈడీ పంజా.. బయటపడ్డ 200 షెల్ కంపెనీల నెట్వర్క్!
- CM Revanth: అమర పోలీసుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా..!
- ED Raids: తెలుగు రాష్ట్రాల్లో ఈడీ మెరుపు దాడులు.. 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు!
ఫీల్డ్ అసిస్టెంట్ ఎంత ప్రయత్నించినా హాజరు నమోదు కాకపోవడంతో శ్రీనివాస్‌కు ఒక విచిత్రమైన, తెలివైన ఆలోచన వచ్చింది. పక్కనే ఉన్న ఒక మహిళా కూలీ జుట్టు ను తన తలపై విగ్లాగా పెట్టుకుని యాప్ కెమెరా ముందుకు వచ్చాడు. అంతే.. మరుక్షణమే యాప్ ఆ ముఖాన్ని గుర్తించి హాజరును ‘సక్సెస్’ అంటూ నమోదు చేసింది!
సాంకేతికతను సాదాసీదా కూలీ తన గృహోపకరణ ఐడియాతో బురిడీ కొట్టించడంతో అక్కడున్న తోటి కూలీలంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. టెక్నాలజీ తెస్తున్న తిప్పలకు నవ్వుకోవాలో, ఆ కూలీ సమయస్ఫూర్తికి మెచ్చుకోవాలో తెలియక అందరూ నవ్వుకున్నారు. ఈ వింత సంఘటనకు సంబంధించిన వీడియో, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. “టెక్నాలజీ కంటే మనోళ్ల మాస్ ఐడియాలే తోపు” అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
తాజావార్తలు
-
Annamalai: CJPకి ఎప్పటికీ మద్దతు ఇవ్వం, వారి అజెండా వేరు.. అన్నామలై కీలక వ్యాఖ్యలు..
-
DK Shivakumar: మెటా స్మార్ట్ గ్లాసెస్ ధరించి, నాపై స్టింగ్ ఆపరేషన్.. డీకే శివకుమార్ సంచలన ఆరోపణ..!
-
The Paradise: ఓటీటీలో నాని విధ్వంసం.. నెగెటివ్ టాక్‌తోనూ నెంబర్ 1 స్థానంలో ‘ది ప్యారడైజ్’!
-
BJP: కాంగ్రెస్‌లో ప్రియాంక గాంధీ vs రాహుల్ గాంధీ.. బీజేపీ సంచలన ఆరోపణలు..
-
Bhumana Karunakar Reddy: ఎక్కడికక్కడ నామినేషన్లు అడ్డుకుంటున్నారు.. బీహార్‌లో కూడా ఇంత నియంత పాలన సాగలేదు..
ట్రెండింగ్
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!