Train Accident: లోకో పైలట్ అప్రమత్తత.. తప్పిన రైలు ప్రమాదం
- మహబూబాబాద్‌లో తెల్లవారుజామున ఘటన
- సడెన్ బ్రేక్‌తో తప్పిన పెను ప్రమాదం
- గేట్మెన్ నిర్లక్ష్యంపై సస్పెన్షన్
- ఘటనపై రైల్వే విచారణ ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహబూబాబాద్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఒక పెద్ద రైలు ప్రమాదం తృటిలో తప్పింది. కేసముద్రం మండలం ఇంటికన్నె రైల్వే స్టేషన్ సమీపంలోని గేట్ నంబర్ 75 వద్ద ఈ ఆందోళనకర ఘటన చోటుచేసుకుంది. తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో గేట్మెన్ నిర్లక్ష్యం కారణంగా ట్రాక్‌పై సిగ్నల్ ఫుట్‌బ్యాక్ అయింది. దీనిని గమనించిన రైలు లోకో పైలట్ (డ్రైవర్) అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి, సమయస్ఫూర్తితో సడెన్ బ్రేక్ వేశారు. లోకో పైలట్ చాకచక్యంగా రైలును నిలిపివేయడంతో ఒక పెద్ద ప్రమాదం తప్పిందని, ఈ ప్రమాద విప్లవం నుండి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని రైల్వే వర్గాలు తెలిపాయి. అయితే ఈ ఘటన తెల్లవారుజామున జరిగినా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Also Read
- Off The Record: ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే.. వయా ఎంపీ..!
- Off The Record: జీహెచ్ఎంసీలో ముద్ర కోసం ప్రభుత్వ ప్రయత్నాలు.. కార్పొరేషన్స్ ఎన్నికలపై దృష్టి.!
- PDS Rice : ఇబ్రహీం పట్నం లో భారీగా పీడీఎస్ బియ్యం పట్టివేత.. రైస్ మిల్లుపై దాడి
- Chikkadpally: యువతితో అసభ్య ప్రవర్తన.. ఘర్షణలో డీఆర్డీవో ఉద్యోగి మృతి
ఒక్కసారిగా రైలుకు సడెన్ బ్రేకులు పడటంతో నిద్రలో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురై ఉలిక్కిపడ్డారు. ప్రమాదం తప్పిందని తెలుసుకున్న తర్వాత వారంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలతో ముడిపడి ఉన్న విధుల్లో ఘోర నిర్లక్ష్యం వహించిన గేట్మెన్ తీరుపై రైల్వే ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం సదరు గేట్‌మెన్‌ను తక్షణమే విధుల్లో నుంచి సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై రైల్వే రక్షణ దళం, ఉన్నతాధికారులు పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు.
తాజావార్తలు
-
Story Board : స్థానిక ఎన్నికల్లో పరిస్థితి అదుపు తప్పితే సుప్రీం జోక్యం తప్పదా ?
-
AP Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే.!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
Akka Trailer: తుపాకీ పట్టిన ‘మహానటి’.. ‘అక్క’ ట్రైలర్‌తో సెన్సేషన్!
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
ట్రెండింగ్
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!