టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు.. మంత్రులు.. ధాన్యాన్ని పంది కొక్కుల లెక్క బుక్కారని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిజామాబాద్‌లో రైస్ మిల్లర్లతో కవిత కుమ్మక్కు అయ్యిందని ఆయన ఆరోపించారు. బీజేపీకి చిత్తశుద్ది ఉంటే ధాన్యం కొనుగోలు పై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు డబ్బులు ఇస్తా అని కోట్లు వసూలు చేసింది కవిత అని, ఆ డబ్బులు ఏమయ్యాయి చెప్పు అని ఆయన ప్రశ్నించారు. యువతను మత్తులో నింపి కాలం వెల్లదీస్తున్నారని, సీపీ, ట్రాఫిక్ చలాన్ల పేరుతో 250 కోట్లు వసూలు చేశారని, పబ్బులు కట్టడి ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు.
సీవీ ఆనంద్ నిజాయితీ గల అధికారి.. ప్రభుత్వం ఒత్తిడికి లొంగ కుండా పబ్ ల లో డ్రగ్స్ మాఫియాను కట్టడి చేయాలన్నారు. కేసీఆర్ తెలంగాణను మత్తులో ముంచుతు… విద్యుత్ ఛార్జీలు పెంచారని, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారని ఆయన మండిపడ్డారు. నిరుద్యోగులను ప్రభుత్వం నిండా ముంచిందని, డ్రగ్స్ పై కట్టడి చేయండి.. యువతను ఆదుకోండని ఆయన వ్యాఖ్యానించారు. భద్రాచలం రాముడికి కేసీఆర్ టోపీ పెట్టిండు.. భద్రాద్రి రాముడికి పట్టు బట్టలు కోసం కూడా డబ్బులు ఇవ్వడం లేదు కేసీఆర్ అని ఆయన విమర్శించారు. అధికారంలో ఉన్నొడు ఆందోళన కాదు.. పరిష్కారం చూపాలి, కోట్లాడి తెలంగాణ తెచ్చిన అనే కేసీఆర్, వడ్ల కొనుగోలు ఎందుకు చేయించడం లేదని ఆయన అన్నారు.